Breaking News

13 ఏళ్ల తర్వాత రంజీ బరిలో ​కోహ్లి.. పోటెత్తిన జనం.. తొక్కిసలాట

Published on Thu, 01/30/2025 - 12:37

టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత రంజీ బరిలోకి దిగాడు. రైల్వేస్‌తో ఇవాళ (జనవరి 30) మొదలైన మ్యాచ్‌లో కోహ్లి ఢిల్లీ తరఫున ఆడుతున్నాడు. కోహ్లి సొంత మైదానమైన అరుణ్‌ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ టాస్‌ గెలిచి తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. 

చాలాకాలం తర్వాత కోహ్లి సొంత మైదానంలో రంజీ మ్యాచ్‌ ఆడుతుండటంతో అతన్ని చూసేందుకు జనం పోటెత్తారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మ్యాచ్‌ చూసేందుకు 15 వేల పైచిలుకు జనం హాజరయ్యారు. సాధారణంగా రంజీ మ్యాచ్‌ చూసేందుకు ఈ స్థాయిలో జనం రారు. 

కోహ్లిని తమ సొంత మైదానంలో చూసేందుకు అభిమానులు ఇవాళ తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. మ్యాచ్‌ ప్రారంభం కాగానే స్టేడియం మొత్తం కిక్కిరిసిపోయింది. కోహ్లి నామస్మరణతో అరుణ్‌ జైట్లీ స్టేడియం మార్మోగిపోయింది. స్టేడియంలోకి ప్రవేశం ఉచితం కావడంతో జనాలను అదుపు చేయడం పోలీసుల వల్ల కావడం లేదు. స్కూలు విద్యార్థులు సైతం భారీ సంఖ్యలో హాజరయ్యారు. 

మైదానంలోకి ప్రవేశించిన అభిమాని.. కోహ్లికి పాదాభివందనం
కోహ్లి ఫీల్డింగ్‌ చేస్తుండగా ఓ అభిమాని స్టేడియంలోకి జోరబడ్డాడు. సెక్యూరిటీని తప్పించుకుని కోహ్లికి పాదాభివందనం చేశాడు. అనంతరం సెక్యూరిటీ అతన్ని  అదుపులోకి తీసుకుని దండించే ప్రయత్నం చేసింది. అయితే కోహ్లి వారిని వారించి సదరు అభిమానిని వదిలి పెట్టాలని కోరాడు. 

ఈ మ్యాచ్‌లో కోహ్లిని చూసేందుకు ఢిల్లీ నుంచే కాక చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా అభిమానులు వచ్చారు. ఓ అభిమాని ఆంధ్ర నుంచి వచ్చి కోహ్లిని చూస్తూ తరించాడు. కోహ్లిని చూసేందుకు ఇంకా జనాలు వస్తున్నారు. అభిమానులను కంట్రోల్‌ చేయడం కోహ్లి వల్ల కాకపోవడంతో పారా మిలిటరీ రంగంలోకి దిగింది. గతంలో ఓ రంజీ మ్యాచ్‌ చూసేందుకు ఈ స్థాయిలో ప్రేక్షకులు ఎప్పుడూ రాలేదని వ్యాఖ్యాతలు అంటున్నారు. 

తొక్కిసలాట.. పలువురికి గాయాలు
ఓ దశలో స్టేడియంలోకి వచ్చేందుకు పెద్ద సంఖ్యలో జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. ఈ సమయంలో తొక్కిసలాట జరిగింది. పలువురు గాయాలపాలయ్యారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. పోలీసులు, పారా మిలిటరీ ఒక్కొక్కరిని స్టేడియంలోకి పంపిస్తున్నారు. ఎంట్రీ ఉచితం కావడంతోనే అభిమానులు ఈ స్థాయిలో పోటెత్తారని పోలీసులు అంటున్నారు. ఈ మ్యాచ్‌ను జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బౌలింగ్‌ చేస్తున్న ఢిల్లీ.. రైల్వేస్‌పై పట్టు సాధించింది. ఢిల్లీ బౌలర్లు మనీ గ్రేవాల్‌ (8-1-14-2), సిద్దాంత్‌ శర్మ (6-1-25-2), నవ్‌దీప్‌ సైనీ (10-1-31-1) చెలరేగడంతో రైల్వేస్‌ 27 ఓవర్లలో 87 పరుగులు మాత్రమే చేసి 5 వికెట్లు కోల్పోయింది. వికెట్‌కీపర్‌ ఉపేంద్ర యాదవ్‌ (27), కర్ణ్‌ శర్మ (2) క్రీజ్‌లో ఉన్నారు.

ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోనూ అదిరిపోయే ట్రాక్‌ రికార్డు
అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన ట్రాక్‌ రికార్డు కలిగిన విరాట్‌ కోహ్లికి ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లోనూ అదిరిపోయే రికార్డు ఉంది. ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో ఢిల్లీకు ప్రాతినిథ్యం వహించే విరాట్‌.. ఆ జట్టు తరఫున 40 ఇన్నింగ్స్‌లు ఆడి 52.66 సగటున 1843 పరుగులు చేశాడు. ఇందులో 6 శతకాలు, 6 అర్ద శతకాలు ఉన్నాయి. కోహ్లి చిన్న వయసులోనే జాతీయ జట్టులోకి ప్రవేశించడంతో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ పెద్దగా ఆడలేకపోయాడు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)