Breaking News

పంకజ్‌ అద్వానీకి రజత పతకం

Published on Sun, 04/13/2025 - 02:10

న్యూఢిల్లీ: వరల్డ్‌ మ్యాచ్‌ప్లే బిలియర్డ్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత దిగ్గజం పంకజ్‌ అద్వానీ రజత పతకం కైవసం చేసుకున్నాడు. ఐర్లాండ్‌ వేదికగా జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో పంకజ్‌ హోరాహోరీగా పోరాడి ఓడాడు. శనివారం జరిగిన తుదిపోరులో పంకజ్‌ 7–8 (100–19, 100–0, 47–100, 52–100, 100–19, 0–100, 100–49, 3–100, 100–34, 100–4, 85–100, 100–31, 53–100, 43–100, 28–100) ఫ్రేమ్‌ల తేడాతో ఇంగ్లండ్‌కు చెందిన డేవిడ్‌ కాసియర్‌ చేతిలో పరాజయం పాలయ్యాడు. 

బిలియర్డ్స్, స్నూకర్‌ క్రీడాంశాల్లో వివిధ విభాగాల్లో కలిపి 28 సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన పంకజ్‌... ‘బెస్ట్‌ ఆఫ్‌ 15’ పోరులో ఆరంభంలో చక్కటి ఆధిపత్యం కనబర్చినా... ఆఖర్లో పుంజుకున్న ఇంగ్లండ్‌ క్యూయిస్ట్‌ విజయం సాధించాడు. ఇక ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ఐబీఎస్‌ఎఫ్‌ వరల్డ్‌ బిలియర్డ్స్‌ చాంపియన్‌షిప్‌లో పంకజ్‌ పోటీ పడనున్నాడు. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న అద్వానీ... 2016 నుంచి ఈ టోర్నీలో వరుసగా టైటిల్స్‌ సాధిస్తూ వస్తున్నాడు. 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)