Breaking News

WC 2023: టీమిండియాకు భారీ షాక్‌! హార్దిక్‌ పాండ్యా ఇక..

Published on Thu, 10/26/2023 - 14:14

ICC WC 2023: వన్డే వరల్డ్‌కప్‌-2023లో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా చీలమండ గాయం తీవ్రతరమైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు దూరమైన పాండ్యా.. మరికొన్ని మ్యాచ్‌లకు కూడా అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది.

ఈ మేరకు బీసీసీఐ వర్గాలు.. ‘‘పాండ్యా ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో నితిన్‌ పటేల్‌ నేతృత్వంలోని వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు. గాయం తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తోంది.

లిగమెంట్‌ టియర్‌(మోకాలి జాయింట్‌లో) కూడా ఉందనిపిస్తోంది. కాబట్టి కనీసం రెండు వారాల పాటు విశ్రాంతి అవసరమవుతుంది. గాయం పూర్తిగా తగ్గకముందు ఎన్సీఏ అతడిని ఆడేందుకు అస్సలు పంపించదు. 

అయితే, వైద్య బృందం నిరంతరం పాండ్యాను పర్యవేక్షిస్తూ మేనేజ్‌మెంట్‌కు ఎప్పటికపుడు అప్‌డేట్‌ ఇస్తోంది. అతడు కోలుకునేందుకు కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే అతడు మైదానంలో దిగేలా కృషి చేస్తోంది’’ అని పేర్కొన్నట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా తన కథనంలో వెల్లడించింది.

అయితే, పాండ్యా లీగ్‌ దశ ముగిసేనాటికి అందుబాటులోకి వస్తాడని భావిస్తున్న మేనేజ్‌మెంట్‌ అతడి స్థానాన్ని వేరే ప్లేయర్‌తో భర్తీ చేసేందుకు సుముఖంగా లేనట్లు తెలిపింది.  కాగా ప్రపంచకప్‌-2023లో హార్దిక్‌ పాండ్యా బ్యాట్‌తో రాణించడంతో పాటు కీలక వికెట్లు తీసి బౌలింగ్‌లోనూ రాణించాడు. అయితే, మరో పేస్‌ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ అందుబాటులో ఉన్నప్పటికీ పాండ్యా స్థానాన్ని అతడు పూర్తి స్థాయిలో భర్తీ చేయలేకపోవచ్చు.

చదవండి: WC 2023: ఇంగ్లండ్‌తో మ్యాచ్‌.. స్టార్‌ పేసర్‌కు రెస్ట్‌! జట్టులోకి అశ్విన్‌.. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)