Breaking News

పాకి​స్తాన్‌కు మరో షాక్‌.. ఇంగ్లండ్‌ చేతిలో ఘోర ఓటమి

Published on Fri, 10/11/2024 - 12:34

పాకిస్తాన్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. ముల్తాన్ వేదిక‌గా జ‌రిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ 47 ప‌రుగుల‌తో పాక్‌ను ఇంగ్లీష్ జ‌ట్టు చిత్తు చేసింది. 267 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పాకిస్తాన్ 220 ప‌రుగుల‌కే ఆలౌటైంది. 

దీంతో మ‌సూద్ సేన ఘోర ఓటమి చ‌విచూడాల్సి వ‌చ్చింది. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో స్పిన్న‌ర్ జాక్ లీచ్ 4 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. అట్కిన‌స‌న్‌, కార్సే త‌లా రెండు వికెట్లు సాధించారు. పాక్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో అఘా సల్మాన్‌(63) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

బ్రూక్‌, రూట్ విధ్వంసం..
అంతకుముందు ఇంగ్లండ్‌​ తమ తొలి ఇన్నింగ్స్‌లో విధ్వంసం సృష్టించింది. మొదటి ఇన్నింగ్స్‌ను ఇంగ్లీష్‌​ జట్టు 823/7 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో హ్యారీ బ్రూక్‌, జో రూట్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. హ్యారీ బ్రూక్‌ (322 బంతుల్లో 317; 29 ఫోర్లు, 3 సిక్సర్లు) ట్రిపుల్‌ సెంచరీ, జో రూట్‌ (375 బంతుల్లో 262; 17 ఫోర్లు) డబుల్‌ సెంచరీతో మెరిశారు. 

వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 454 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెల​కొల్పారు. మరోవైపు పాకిస్తాన్ కూడా తమ మొదటి ఇన్నింగ్స్‌లో 556 పరుగుల భారీ స్కోర సాధించింది. కెప్టెన్ షాన్ మసూద్‌(151), సల్మాన్‌(104), షఫీక్(102) సెంచరీలతో చెలరేగారు. ఏదమైనప్పటకి పాక్ ఓటమి పాల్వడంతో వారి సెంచరీలు వృథా అయిపోయాయి. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ఆక్టోబర్‌​ 15 నుంచి ముల్తాన్‌ వేదికగా ప్రారంభం కానుంది.
చదవండి: ప్లీజ్‌.. టీమిండియాను చూసి నేర్చుకోండి: పాక్‌ మాజీ క్రికెటర్‌
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)