Breaking News

తీరు మార‌ని పాకిస్తాన్‌.. 91 ప‌రుగుల‌కే ఆలౌట్‌

Published on Sun, 03/16/2025 - 08:52

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న‌తో గ్రూపు స్టేజిలోనే ఇంటిముఖం ప‌ట్టిన పాకిస్తాన్ క్రికెట్ జ‌ట్టు ఆట‌తీరు ఏ మాత్రం మార‌లేదు. క్రైస్ట్ చ‌ర్చ్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న తొలి టీ20లో పాకిస్తాన్ బ్యాట‌ర్లు ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్.. కివీస్ బౌల‌ర్ల దాటికి 18.4 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 91 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.

న్యూజిలాండ్ ఫాస్ట్ బౌల‌ర్ల దాటికి పాక్ బ్యాట‌ర్లు విల్ల‌విల్లాడారు. కివీస్ బౌల‌ర్ల‌లో జాకబ్ డఫీ 4 వికెట్లతో పాకిస్తాన్ ప‌త‌నాన్ని శాసించ‌గా.. కైల్ జేమిస‌న్ మూడు, ఇష్ సోది రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. పాకిస్తాన్ బ్యాట‌ర్ల‌లో కుష్దిల్ షా(32) ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. కెప్టెన్ అగా స‌ల్మాన్‌(18)తో స‌హా మిగితా బ్యాట‌ర్లంతా దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. 

కాగా న్యూజిలాండ్‌ పర్యటనలో భాగంగా పాకిస్తాన్‌.. ఆతిథ్య జట్టుతో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. అయితే టీ20 సిరీస్‌​కు మాత్రం కీలక ఆటగాళ్లపై పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు వేటు వేసింది. కెప్టెన్‌ మహ్మద్‌ రిజ్వాన్‌, బాబర్‌ ఆజాంలను టీ20 జట్టు నుంచి పాకిస్తాన్‌ సెలక్టర్లు తప్పించారు. మహ్మద్‌ రిజ్వాన్‌ స్ధానంలో సల్మాన్‌ అలీ అగాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. కానీ వన్డేల్లో మాత్రం రిజ్వాన్‌ను కెప్టెన్‌గా పీసీబీ కొనసాగించింది.

తుది జట్లు
న్యూజిలాండ్‌: టిమ్ సీఫెర్ట్, ఫిన్ అలెన్, టిమ్ రాబిన్సన్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ హే (వికెట్‌​ కీపర్‌), మైఖేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్‌), జకారీ ఫౌల్క్స్, కైల్ జామిసన్, ఇష్ సోధి, జాకబ్ డఫీ

పాకిస్తాన్‌: హారీస్ (వికెట్ కీపర్‌), హసన్ నవాజ్, సల్మాన్ అఘా (కెప్టెన్‌), ఇర్ఫాన్ ఖాన్, షాదాబ్ ఖాన్, అబ్దుల్ సమద్, ఖుష్దిల్ షా, జహందాద్ ఖాన్, షాహీన్ అఫ్రిది, మహ్మద్ అలీ, అబ్రార్ అహ్మద్
చదవండి: WPL 2025: ఛాంపియన్‌గా ముంబై ఇండియన్స్‌.. ప్రైజ్‌ మనీ ఎన్ని కోట్లంటే?
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)