Breaking News

కొంచెం కూడా సిగ్గు లేదు.. జింబాబ్వేను బ్ర‌తిమాలుకున్న పాకిస్తాన్‌

Published on Sun, 10/19/2025 - 08:07

శ్రీలంక‌-పాకిస్తాన్‌తో జ‌రగ‌నున్న టీ20 ట్రై సిరీస్ నుంచి అఫ్గానిస్తాన్ వైదొలిగిన సంగ‌తి తెలిసిందే. తమ దేశంపై పాకిస్తాన్‌ సైన్యం చేసిన వైమానిక దాడిని ఖండిస్తూ అఫ్గన్‌ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. అఫ్గాన్‌లోని అర్గున్, బర్మల్‌ జిల్లాలపై పాక్‌ సైన్యం చేసిన దాడిలో ముగ్గురు వర్ధమాన క్రికెటర్లు మృతి చెందారు  ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన అఫ్గన్‌ బోర్డు పాక్‌ గడ్డపై క్రికెట్‌ ఆడేది లేదని తేల్చి చెప్పింది.

అయితే అఫ్గానిస్తాన్ తప్పుకొన్నప్పటికి ఈ ముక్కోణపు టోర్నీ షెడ్యూల్ ప్రకారం జ‌ర‌గ‌నుంది. ఈ టోర్నీలో అఫ్గాన్ స్ధానాన్ని జింబాబ్వేతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భ‌ర్తీ చేసింది. ఇప్పటికే ఈ విషయంపై జింబాబ్వే క్రికెట్ బోర్డుతో పీసీబీ చ‌ర్చ‌లు జ‌రిపింది. అందుకు జింబాబ్వే క్రికెట్ కూడా అంగీక‌రించ‌నట్లు పీసీబీ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. 

కాగా అఫ్గానిస్తాన్ స్ధానాన్ని భ‌ర్తీ చేసేందుకు నేపాల్‌, యూఏఈ క్రికెట్ బోర్డుల‌తో కూడా పాక్ సంప్ర‌దింపులు జ‌రిపిన‌ట్లు స‌మాచారం. కానీ అందుకు ఆయా క్రికెట్ బోర్డులు కాస్త సమ‌యం కోరిన‌ట్లు స‌మాచారం. కానీ అంత‌లోనే జింబాబ్వే ఒప్పుకోవ‌డంలో అప్‌డేట‌డ్ షెడ్యూల్‌ను పీసీబీ విడుద‌ల చేసింది.

అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణ‌యంపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తోంది. మీ దేశం చేసిన దాడిలో ముగ్గురు యువ క్రికెట‌ర్లు ప్రాణాలు కోల్పోతే .. సంతాపం తెల‌పాల్సింది బ‌దులు కొత్త షెడ్యూల్ రిలీజ్ చేస్తారా? అంటూ ఎక్స్‌లో పోస్టులు పెడుతున్నారు.

నవంబర్ 17 నుండి 29 వరకు జరగ‌నున్న ఈ ముక్కోణ‌పు సిరీస్‌కు రావల్పిండి, లహోర్ ఆతిథ్య‌మివ్వ‌నున్నాయి. ఈ సిరీస్ టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026 స‌న్నాహాకాల్లో భాగంగా జ‌ర‌గ‌నుంది. కాగా ఈ యువ క్రికెట‌ర్ల మృతి పట్ల ఐసీసీ, బీసీసీఐ కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి.

ట్రైసిరీస్‌ షెడ్యూల్‌

17 నవంబర్ – పాకిస్తాన్ వర్సెస్‌ జింబాబ్వే, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి

19 నవంబర్ – శ్రీలంక వర్సెస్‌ జింబాబ్వే, రావల్పిండి క్రికెట్ స్టేడియం, రావల్పిండి

22 నవంబర్ – పాకిస్తాన్ వర్సెస్‌ శ్రీలంక, గడాఫీ స్టేడియం, లాహోర్

23 నవంబర్ – పాకిస్తాన్ వర్సెస్‌ జింబాబ్వే, గడాఫీ స్టేడియం, లాహోర్

25 నవంబర్ – శ్రీలంక వర్సెస్‌ జింబాబ్వే, గడాఫీ స్టేడియం, లాహోర్

27 నవంబర్ – పాకిస్తాన్ వర్సెస్‌ శ్రీలంక, గడాఫీ స్టేడియం, లాహోర్

29 నవంబర్ – ఫైనల్, గడాఫీ స్టేడియం, లాహోర్
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)