Breaking News

పాకిస్తాన్‌ కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ప్లేయర్‌..

Published on Fri, 11/07/2025 - 14:18

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్ కోసం తమ జట్టును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. పాకిస్తాన్ షాహీన్స్ జట్టు కెప్టెన్‌గా ఎవరూ ఊహించని ఆటగాడు మహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్ నియాజీ ఎంపికయ్యాడు. ఇర్ఫాన్ ఖాన్ ఇప్పటికే పేలవ ఫామ్ కారణంగా పాక్ సీనియర్ జట్టులో చోటు కోల్పోయాడు.

ఇర్ఫాన్ చివరగా ఈ ఏడాది మార్చిలో పాక్ తరపున ఆడాడు. అప్పటి నుంచి అతడు జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నారు. ఈ ఆల్‌రౌండర్ తన సత్తాను నిరూపించుకునేందుకు పీసీబీ మరొక అవకాశం ఇచ్చింది. ఇక ఈ జట్టులో అరాఫత్ మిన్హాస్, మహమ్మద్ నయీమ్, ఉబైద్ షా యువ ఆటగాళ్లకు పీసీబీ సెలక్టర్లు చోటు ఇచ్చారు. 

పాక్ పేస్‌ బౌలర్ నసీమ్ షా సోదరుడు అయిన ఉబైద్ షా దేశవాళీ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. పీఎస్‌ఎల్‌-2025లోనూ సత్తాచాటాడు. ఈ క్రమంలోనే అతడిని సెలక్టర్లు ఆసియా కప్‌నకు ఎంపిక చేశారు . అదేవిధంగా ఈ టోర్నీలో పాకిస్తాన్ షాహీన్స్ స్పిన్ బౌలింగ్ విభాగాన్ని సుఫియాన్ మోఖిమ్ లీడ్ చేయనున్నాడు. సుఫియాన్ ప్రస్తుతం పాక్ టీ20 జట్టులో కీలక స్పిన్నర్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

భార‌త్‌-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
కాగా ఈ టోర్నీలో పాకిస్తాన్ షాహీన్స్ జట్టు  ఇండియా-ఎ, ఒమన్‌, యూఎఈలతో పాటు గ్రూప్-బిలో ఉంది. ఈ టోర్నీ ఖ‌తార్ వేదిక‌గా న‌వంబ‌ర్ 14 నుంచి ప్రారంభం కానుంది. టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌లో ఒమన్‌-పాక్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. అనంత‌రం న‌వంబ‌ర్ 16న చిర‌కాల ప్ర‌త్య‌ర్ధులు పాక్‌-భార‌త్ అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ టోర్నీ కోసం భార‌త జ‌ట్టును ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఇండియా కెప్టెన్‌గా జితేష్ శ‌ర్మ వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు.

పాక్ జట్టు
ముహమ్మద్ ఇర్ఫాన్ ఖాన్ (కెప్టెన్), అహ్మద్ డానియాల్, అరాఫత్ మిన్హాస్, మాజ్ సదాకత్, మహ్మద్ ఫైక్, ముహమ్మద్ ఘాజీ ఘోరి, మహ్మద్ నయీమ్, మహ్మద్ సల్మాన్, మహ్మద్ షాజాద్, ముబాసిర్ ఖాన్, సాద్ మసూద్, షాహిద్ అజీజ్, సుఫియాన్ మొకిమ్, ఉబైద్ షా

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ కోసం భారత A జట్టు: ప్రియాంశ్‌ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, నేహల్ వధేరా, నమన్ ధిర్ (వైస్ కెప్టెన్‌), సూర్యాంశ్ షెడ్గే, జితేష్ శర్మ (కెప్టెన్‌) (వికెట్ కీప‌ర్‌), రమణదీప్ సింగ్, హర్ష్ దూబే, అశుతోష్ శర్మ, యశ్ ఠాకూర్, గుర్జప్నీత్‌ సింగ్‌, విజయ్‌కుమార్‌ వైశాక్‌, యుద్ద్‌వీర్‌ సింగ్‌ చరక్‌, అభిషేక్‌ పోరెల్ (వికెట్ కీప‌ర్‌), సుయాష్ శర్మ

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)