Breaking News

హరీస్‌ రవూఫ్‌పై వేటు

Published on Mon, 01/26/2026 - 02:59

లాహోర్‌: వచ్చే నెలలో భారత్‌–శ్రీలంక వేదికగా జరిగే పురుషుల టి20 ప్రపంచకప్‌లో పాల్గొనే పాకిస్టాన్‌ జట్టును ఆదివారం ప్రకటించారు. 15 మంది సభ్యుల పాక్‌ జట్టుకు సల్మాన్‌ అలీ ఆఘా నాయకత్వం వహిస్తాడు. గతేడాది ఆసియా కప్‌ ఫైనల్‌ ఆడిన పేసర్‌ హరీస్‌ రవూఫ్‌పై సెలక్టర్లు వేటు వేయడం గమనార్హం. ఆదివారం ఆ్రస్టేలియాలో ముగిసిన బిగ్‌బాష్‌ టి20 లీగ్‌లో హరీస్‌ రవూఫ్‌ 20 వికెట్లతో లీగ్‌ ‘టాపర్‌’గా నిలిచాడు. 

అంతేకాకుండా అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక వికెట్లు (94 మ్యాచ్‌ల్లో 133 వికెట్లు) తీసిన పాక్‌ బౌలర్‌గానూ గుర్తింపు పొందాడు. ‘పాక్‌ తరఫున రవూఫ్‌ చాలా క్రికెట్‌ ఆడాడు. శ్రీలంకలో పిచ్‌ పరిస్థితులను బట్టి జట్టును ఎంపిక చేశాం’ అని వివరించాడు. మెగా టోర్నీలో ఆడటం, ఆడకపోవడం అనేది పాక్‌ ప్రభుత్వం చూసుకుంటుందని జావేద్‌ అన్నాడు. 

బంగ్లాదేశ్‌ను ప్రపంచకప్‌ నుంచి తప్పించగానే పాక్‌ క్రికెట్‌ బోర్డు చీఫ్‌ మోసిన్‌ నఖ్వీ మాట్లాడుతూ తమ దేశ ప్రధానమంత్రి అదేశాల మేరకే నడుచుకుంటామని, ఐసీసీ ప్రకారం కాదని చెప్పారు. పాక్‌ ప్రభుత్వం అనుమతి ఇస్తేనే ఈ మెగా ఈవెంట్‌లో పాక్‌ ఆడుతుందని నఖ్వీ తెలిపారు. ఆతిథ్య భారత్‌ ఉన్న గ్రూప్‌ ‘ఎ’లో పాకిస్తాన్‌ ఉంది. ఇందులో నమీబియా, నెదర్లాండ్స్, అమెరికా ఇతర జట్లు. వచ్చేనెల 7 నుంచి జరిగే ప్రపంచకప్‌లో పాక్, నెదర్లాండ్స్‌ల మధ్యే తొలి మ్యాచ్‌ జరుగనుంది.  

పాకిస్తాన్‌ టి20 జట్టు: సల్మాన్‌ అలీ ఆఘా (కెప్టెన్ ), అబ్రార్‌ అహ్మద్, బాబర్‌ ఆజమ్, ఫహీమ్‌ అష్రఫ్, ఫఖర్‌ జమాన్, ఖ్వాజా మొహమ్మద్‌ నాఫే, మొహమ్మద్‌ నవాజ్, సల్మాన్‌ మీర్జా, నసీమ్‌ షా, సాహిబ్‌జాదా ఫర్హాన్, సయీమ్‌ అయూబ్, షాహిన్‌ అఫ్రిది, షాదాబ్‌ ఖాన్, ఉస్మాన్‌ ఖాన్, ఉస్మాన్‌ తారీఖ్‌.   

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)