Breaking News

మరో మెగా క్రికెట్‌ టోర్నీకి ఆతిథ్యమివ్వనున్న పాకిస్తాన్‌

Published on Wed, 03/05/2025 - 22:11

ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025 ముగిసిన నెల రోజుల్లోనే పాకిస్తాన్‌ మరో మెగా క్రికెట్‌ టోర్నీకి ఆతిథ్యమివ్వనుంది. పాక్‌ వేదికగా ఏప్రిల్‌ 4 నుంచి మహిళల వన్డే వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌  జరుగనున్నాయి. ఈ విషయాన్ని ఐసీసీ సూచనప్రాయంగా వెల్లడించింది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. ఇందులో రెండు జట్లు (ఫైనల్‌కు చేరే జట్లు) ఈ ఏడాది భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తాయి. 

వరల్డ్‌ కప్‌ క్వాలిఫయర్స్‌లో పాకిస్తాన్‌ సహా బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌, ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌, థాయ్‌లాండ్‌ జట్లు పాల్గొంటాయి. ఈ టోర్నీ జరిగే తేదీలు, వేదికలను త్వరలోనే ప్రకటింస్తారు. లాహోర్‌ వేదికగా ఈ టోర్నీ మ్యాచ్‌లన్నీ జరుగుతాయని తెలుస్తుంది.

ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్‌ వేదికగా మహిళల వన్డే వరల్డ్‌కప్‌ జరుగనుంది. ఈ టోర్నీకి భారత్‌ సహా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్‌ నేరుగా అర్హత సాధించాయి. క్వాలిఫయర్స్‌ ద్వారా పాక్‌ వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తే భారత్‌, పాక్‌ మ్యాచ్‌లు తటస్థ వేదికలపై జరుగుతాయి. భారత్‌ 2013లో కూడా మహిళల వన్డే వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిచ్చింది. నాడు మెజార్టీ మ్యాచ్‌లు ముంబైలో జరగగా.. పాకిస్తాన్‌ మ్యాచ్‌లన్నీ కటక్‌లో జరిగాయి.

కాగా, పాకిస్తాన్‌ 29 ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ టోర్నీకి (ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025) ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే. పాక్‌లో చివరిగా 1996 పురుషుల వన్డే వరల్డ్‌కప్‌ జరిగింది. ఈ టోర్నీకి పాక్‌తో పాటు భారత్‌, శ్రీలంక దేశాలు ఆతిథ్యమిచ్చాయి. అప్పటినుంచి భద్రతా కారణాల రిత్యా పాక్‌లో ఒక్క ఐసీసీ ఈవెంట్‌ కూడా జరగలేదు. 

మళ్లీ 29 ఏళ్ల తర్వాత పాక్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025కి ఆతిథ్యమిస్తుంది. ఈ టోర్నీలో కూడా అన్ని మ్యాచ్‌లు పాక్‌లో జరగడం లేదు. భద్రతా కారణాల రిత్యా భారత్‌ తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడుతుంది. ఈ టోర్నీలో భారత్‌ ఇదివరకే ఫైనల్‌కు చేరడంతో ఫైనల్‌ కూడా దుబాయ్‌లోనే జరుగుతుంది. ఈ టోర్నీలో పాక్‌ ఒక్క విజయం కూడా సాధించకుండానే గ్రూప్‌ దశలోనే నిష్క్రమించింది. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)