పాక్‌ బ్యాటర్‌ మహోగ్రరూపం.. వరుసగా 4 సిక్సర్లు బాది మ్యాచ్‌ను గెలిపించిన వైనం

Published on Wed, 01/29/2025 - 18:02

బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌-2025లో (Bangladesh Premier League) పాకిస్తాన్‌ బ్యాటర్‌ హైదర్‌ అలీ (Haider Ali) మహోగ్రరూపం దాల్చాడు. ఈ లీగ్‌లో చట్టోగ్రామ్‌ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న హైదర్‌.. రంగ్‌పూర్‌ రైడర్స్‌తో ఇవాళ (జనవరి 29) జరిగిన మ్యాచ్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు బాది తన జట్టును గెలిపించాడు. గెలుపుపై ఏ మాత్రం ఆశలు లేని మ్యాచ్‌లో హైదర్‌ నమ్మశక్యంకాని రీతిలో విరుచుకుపడ్డాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రంగ్‌పూర్‌ రైడర్స్‌.. ఇఫ్తికార్‌ అహ్మద్‌ (47 బంతుల్లో 65 నాటౌట్‌; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. రైడర్స్‌ ఇన్నింగ్స్‌లో ఇఫ్తికార్‌ మినహా ఎవరూ రాణించలేదు. 

తొలుత సౌమ్య సర్కార్‌ (17 బంతుల్లో 23; 2 ఫోర్లు, సిక్స్‌), ఆఖర్లో మెహిది హసన్‌ (20 బంతుల్లో 22 నాటౌట్‌; 3 ఫోర్లు) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. స్టీవెన్‌ టేలర్‌ డకౌట్‌ కాగా.. సైఫ్‌ హసన్‌ 8, కెప్టెన్‌ నురుల్‌ హసన్‌ 9, ఇర్ఫాన్‌ సుకూర్‌ ఒక్క పరుగు చేశారు. చట్టోగ్రామ్‌ కింగ్స్‌ బౌలర్లలో ఖలీద్‌ అహ్మద్‌ 2 వికెట్లు పడగొట్టగా.. షొరిఫుల్‌ అస్లాం, షమీమ్‌ హొసేన్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు.

అనంతరం కష్టసాధ్యమైన పిచ్‌పై 144 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన చట్టోగ్రామ్‌ కింగ్స్‌ తొలి 10 ఓవర్లలోనే 3 కీలక వికెట్లు (63 పరుగులకే) కోల్పోయి గెలుపుపై ఆశలు వదులుకుంది.  లహీరు మిలంత 6, గ్రహం క్లార్క్‌ 15, కెప్టెన్‌ మొహమ్మద్‌ మిథున్‌ 20 పరుగులకే ఔటయ్యారు. 

ఈ దశలో పర్వేజ్‌ హొసేన్‌ ఎమోన్‌తో జతకట్టిన హైదర్‌ అలీ తొలుత నిదానంగా ఆడాడు. 106 పరుగుల వద్ద ఎమోన్‌ (43 బంతుల్లో 41; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఔటయ్యాక హైదర్‌ గేర్‌ మార్చాడు. ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో కింగ్స్‌ గెలుపుకు 18 బంతుల్లో 20 పరుగులు అవసరం కాగా.. హైదర్‌ ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. 

అకీఫ్‌ జావిద్‌ వేసిన ఆ ఓవర్‌లో తొలి బంతికే సిక్సర్‌ బాదిన హైదర్‌.. ఆతర్వాతి మూడు బంతులను కూడా భారీ సిక్సర్లుగా మలిచాడు. హైదర్‌ అకీఫ్‌పై ఒక్కసారిగా రెచ్చిపోవడంతో కళ్లు మూసుకుని తెరిచే లోగా మ్యాచ్‌ అయిపోయింది. కింగ్స్‌ మరో 14 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. 

హైదర్‌ ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు. ఈ ఇన్నింగ్స్‌లో 18 బంతులు ఎదుర్కొన్న హైదర్‌.. 6 సిక్సర్లు, బౌండరీ సాయంతో 48 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హైదర్‌కు రహాతుల్‌ ఫిర్దౌస్‌ (6 నాటౌట్‌) సహకరించాడు. ఈ గెలుపుతో చట్టోగ్రామ్‌ కింగ్స్‌ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. కింగ్స్‌ చేతిలో ఓడినా రంగ్‌పూర్‌ రైడర్స్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే కొనసాగుతుంది.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)