Breaking News

బ్యాటింగ్‌ చేస్తూ కుప్పకూలిన పాకిస్తానీ క్రికెటర్‌.. తీవ్ర విషాదం

Published on Tue, 03/18/2025 - 15:57

ఆస్ట్రేలియా క్రికెట్‌లో తీవ్ర విషాదం నెలకొంది. పాకిస్తాన్‌కు చెందిన క్లబ్‌ లెవల్‌ క్రికెటర్‌ జునైల్‌ జఫార్‌ ఖాన్‌ (Junail Zafar Khan) దుర్మరణం పాలయ్యాడు. మ్యాచ్‌ ఆడుతున్న సమయంలో మైదానంలో కుప్పకూలిన అతడు.. అక్కడే ప్రాణాలు విడిచాడు. ఎండ వేడిమి తట్టుకోలేకే జఫార్‌ ఖాన్‌ మరణించినట్లు తెలుస్తోంది.

ఆలస్యంగా వెలుగులోకి
కాగా నలభై ఏళ్ల జఫార్‌ ఖాన్‌కు క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. అందుకే వయసు పైబడుతున్నా లెక్కచేయక క్లబ్‌ స్థాయిలో మ్యాచ్‌లు ఆడుతున్నాడు. ఓల్డ్‌ కాంకొర్డియన్స్‌ క్రికెట్‌ క్లబ్‌కు ప్రాతినిథ్య వహిస్తున్న అతడు.. గత శనివారం ప్రిన్స్‌ అల్‌ఫ్రెడ్‌ ఓల్డ్‌ కాలేజియన్స్‌తో మ్యాచ్‌లో పాల్గొన్నాడు.

నలభై ఓవర్ల పాటు ఫీల్డింగ్‌ చేసిన జఫార్‌ ఖాన్‌.. ఏడు ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేశాడు. పదహారు పరుగుల వ్యక్తిగతస్కోరు వద్ద ఉన్న వేళ అతడు కిందపడిపోయాడు. ఆస్ట్రేలియా సెంట్రల్‌ డే లైట్‌ టైమ్‌ ప్రకారం సాయంత్రం నాలుగు గంటలకు మైదానంలో కుప్పకూలిపోయాడు. 

తీవ్ర విషాదంలో మునిగిపోయాం
ఈ విషాదకర ఘటనపై ఓల్డ్‌ కాంకొర్డియన్స్‌ క్రికెట్‌ క్లబ్‌ స్పందించింది. ‘‘మా క్లబ్‌కు చెందిన విలువైన ఆటగాడు అకస్మాత్తుగా లోకాన్ని విడిచి వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ఈ ఘటనతో మేము తీవ్ర విషాదంలో మునిగిపోయాం. మ్యాచ్‌ ఆడుతున్న సమయంలోనే మా క్లబ్‌ సభ్యుడు మృతి చెందడం మమ్మల్ని కలచివేస్తోంది.

అతడికి చికిత్స అందించేందుకు వైద్య బృందం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. అతడి కుటుంబానికి, సహచర ఆటగాళ్లు, స్నేహితులకు మా ‍ప్రగాఢ సానుభూతి ’’ అని సంతాపం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేసింది.

అడిలైడ్‌లో ఉద్యోగం?
కాగా 2013లో వరకు పాకిస్తాన్‌లోనే ఉన్న జఫార్‌ ఖాన్‌.. ఐటీ రంగంలో అవకాశాలు అందిపుచ్చుకునే క్రమంలో ఆస్ట్రేలియాకు మకాం మార్చినట్లు సమాచారం. అడిలైడ్‌లో ఉద్యోగం చేస్తున్న అతడు క్లబ్‌ క్రికెట్‌ కూడా ఆడుతూ.. దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోవడం విషాదకరం. కాగా దక్షిణ ఆస్ట్రేలియాలో ఎండలు మండిపోతున్నాయి.

గరిష్టంగా 40కి పైగా డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ.. ప్రజలంతగా అప్రమత్తంగా ఉండాలని స్థానిక వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో అడిలైడ్‌ టర్ఫ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ కీలక ప్రకటన విడుదల చేసింది. 42 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఉష్ణోగ్రత మించినట్లయితే..మ్యాచ్‌లు రద్దు చేస్తామని పేర్కొంది.

చదవండి: వెంటిలేటర్‌పై పాక్‌ క్రికెట్‌

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)