Breaking News

రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్న స్టార్‌ క్రికెటర్‌

Published on Mon, 03/25/2024 - 11:58

పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌, ఆ జట్టు స్టార్‌ బౌలర్‌ మొహమ్మద్‌ ఆమిర్‌ తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. పాక్‌ క్రికెట్‌ బోర్డు అవకాశం ఇస్తే మరోసారి దేశానికి ప్రాతినిథ్యం వహించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించాడు. ఈ ఏడాది జరుగబోయే టీ20 వరల్డ్‌కప్‌ ఆడేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాడు. రిటైర్మెంట్‌ వెనక్కు తీసుకుంటున్న విషయాన్ని ఆమిర్‌ ఆదివారం వెల్లడించాడు.

పాక్‌ క్రికెట్‌ బోర్డుతో సంప్రదింపులు జరిపిన అనంతరం రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు ఆమిర్‌ పేర్కొన్నాడు. మరోసారి పాక్‌ జట్టుకు ఎంపిక చేసే విషయంలో పీసీబీ సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిపాడు. పాక్‌ జట్టుకు ఆడటం​ తన కల అని.. పాక్‌కు ప్రాతినిథ్యం వహించే అవకాశం ఏ వయసులో వచ్చినా వదులుకోనని అన్నాడు. 31 ఏళ్ల ఆమిర్‌ 2020లో క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు.

అప్పటి నుంచి లీగ్‌ క్రికెట్‌కు మాత్రమే పరిమితమైన ఆమిర్‌.. తాజాగా తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించాడు. 17 ఏళ్ల వయసులోనే పాక్‌కు ప్రాతినిథ్యం వహించే అవకాశం దక్కించుకున్న ఆమిర్‌.. ఆ జట్టు తరఫున 36 టెస్ట్‌లు, 61 వన్డేలు, 50 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి అతను 259 వికెట్లు పడగొట్టాడు. ఆమిర్‌ వన్డేల్లో రెండు అర్దసెంచరీలు కూడా చేశాడు.

ఇటీవల ఆమిర్‌ పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. 2024 పీఎస్‌ఎల్‌లో అతను 9 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు పడగొట్టాడు. ఆమిర్‌ రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడానికి ముందు మరో పాక్‌ క్రికెటర్‌ కూడా రిటైర్మెంట్‌ను వెనక్కు తీసుకున్నాడు. ఆ జట్టు స్టార్‌ స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ ఇమాద్‌ వసీం​ టీ20 వరల్డ్‌కప్‌లో అవకాశం కోసం రిటైర్మెంట్‌ను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించాడు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)