Breaking News

ఒకే లీగ్‌లో 4 రోజుల్లోనే రెండు ఫ్రాంఛైజీలతో ఒప్పందం!

Published on Wed, 08/05/2026 - 18:30

లంక ప్రీమియర్‌ లీగ్‌ (ఎల్‌పీఎల్‌)-2026 టోర్నమెంట్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పాకిస్తాన్‌ క్రికెటర్‌ ఇఫ్తికార్‌ అహ్మద్‌ అసాధారణ రీతిలో నాలుగు రోజుల వ్యవధిలోనే రెండు ఫ్రాంఛైజీలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ నేపథ్యంలో.. ‘ఇదెక్కడి చోద్యంరా బాబూ’ అంటూ సోషల్‌ మీడియాలో మీమ్స్‌ హల్‌హల్‌ చేస్తున్నాయి.

అసలేం జరిగిందంటే.. 35 ఏళ్ల ఇఫ్తికార్‌ అహ్మద్‌ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌. కుడిచేతి వాటం గల బ్యాటర్‌ అయిన అతడు.. రైటార్మ్‌ స్పిన్నర్‌ కూడా! పాక్‌ తరఫున ఇప్పటికి 4 టెస్టులు, 28 వన్డేలు, 66 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఇఫ్తికార్‌.. ఆయా ఫార్మాట్లలో 61, 614, 998 పరుగులు చేశాడు.

పీఎస్‌ఎల్‌లో పర్లేదు
అదే విధంగా టెస్టుల్లో ఒకటి, వన్డేల్లో 16, టీ20లలో ఎనిమిది వికెట్లు కూల్చాడు. ఇక 2024లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన ఇఫ్తికార్‌ అహ్మద్‌.. ఈ ఏడాది పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లో ఓ మోస్తరుగా రాణించాడు. పది మ్యాచ్‌లలో కలిపి 72 పరుగులు చేయడం(నాలుగుసార్లు నాటౌట్‌)తో పాటు.. 12 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు నేషనల్‌ టీ20 కప్‌, బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో ఆడాడు.

మొన్న అలా. . ఇపుడిలా
ఇదిలా ఉంటే.. ఆగష్టు 2న లంక ప్రీమియర్‌ లీగ్‌లో భాగమైన దంబుల్లా సిక్సర్స్‌తో ఇఫ్తికార్‌ అహ్మద్‌ ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే, ఆ రోజే జాఫ్నా కింగ్స్‌తో మ్యాచ్‌ వర్షం వల్ల రద్దు కావడంతో దంబుల్లా టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచి పరాభవంతో ఇంటిబాటపట్టింది.

ఈ నేపథ్యంలో ఇఫ్తికార్‌ అహ్మద్‌ ఊహించని రీతిలో ఆగష్టు 5న క్యాండీ రాయల్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ జట్టు లీగ్‌ దశలో ఎనిమిదింట మూడు మ్యాచ్‌లు గెలిచి ప్లే ఆఫ్స్‌ చేరింది. ఈ క్రమంలో ఇఫ్తికార్‌ ప్లే ఆఫ్స్‌ దశలో క్యాండీ రాయల్స్‌కు ఆడేందుకు సిద్ధమయ్యాడు. అంటే నాలుగు రోజుల వ్యవధిలోనే దంబుల్లాను వీడి అతడు క్యాండీ రాయల్స్‌తో జట్టుకట్టాడు.

అంతంతమాత్రంగానే
ఈ విషయాన్ని క్యాండీ రాయల్స్‌ బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఇఫ్తికార్‌ అహ్మద్‌కు స్వాగతం చెబుతూ అతడు ప్లే ఆఫ్స్‌లో కీలక పాత్ర పోషించబోతున్నాడనే సంకేతాలు ఇచ్చింది. కాగా 2023లో ఇఫ్తికార్‌ లంక ప్రీమియర్‌ లీగ్‌లో ఆడాడు. అప్పుడు అతడు కొలంబో క్యాప్స్‌కి ప్రాతినిథ్యం వహించి.. రెండు మ్యాచ్‌లలో రెండు వికెట్లు తీయడంతో పాటు నాలుగు ఇన్నింగ్స్‌ ఆడి 25 పరుగులు చేశాడు.

ఇదిలా ఉంటే.. బుధవారం క్వాలిఫయర్‌-1లో జాఫ్నా కింగ్స్‌- గాలే గాలంట్స్‌ తలపడుతుండగా.. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో క్యాండీ రాయల్స్‌ కొలంబో క్యాప్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇక శుక్రవారం క్వాలిఫయర్‌-2, శనివారం లంక ప్రీమియర్‌ లీగ్‌ ఫైనల్‌ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది.

చదవండి: RBI అసిస్టెంట్‌ మేనేజర్‌ విధుల్లో ఇషాన్‌ కిషన్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)