Breaking News

షోయబ్ మాలిక్ ఆల్‌రౌండ్ షో.. సౌతాఫ్రికాపై పాక్ ఘన విజయం

Published on Sat, 07/26/2025 - 14:20

ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్- 2025 టోర్నీలో పాకిస్తాన్ ఛాంపియన్స్‌గా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం లీసెస్టర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఛాంపియన్స్‌ను 31 ప‌రుగుల తేడాతో పాకిస్తాన్ చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఛాంపియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల నష్టానికి 198 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది.

పాక్‌ బ్యాటర్లలో ఉమర్‌ అమీన్‌(58) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. షోయబ్‌ మాలిక్‌(46) కీలక నాక్‌ ఆడాడు. అతడితో పాటు ఆసిఫ్‌ అలీ(23), షర్జీల్ ఖాన్(19) రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఓలీవర్‌ రెండు, విజోలన్‌, డుమినీ, పార్నల్‌ తలా వికెట్‌ సాధించారు. అనంతరం లక్ష్య చేధనలో దక్షిణాఫ్రికా ఛాంప్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులు మాత్రమే చేయగల్గింది. 

సఫారీ బ్యాటర్లలో మోర్నే వాన్ వైక్(44) మినహా మిగితా బ్యాటర్లు ఎవరూ చెప్పుకొదగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. పాక్‌ బౌలర్లలో హాఫీజ్‌, తన్వీర్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. మాలిక్‌, రియాజ్‌, సోహిల్‌ ఖాన్‌, వసీం తలా వికెట్‌ సాధించారు. కాగా పాకిస్తాన్‌ ఛాంపియన్స్‌, ఇండియా ఛాంపియన్స్‌ మధ్య మ్యాచ్‌ రద్దు అయిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తల కారణంగా డబ్ల్యూసీఎల్‌ మెనెజ్‌మెంట్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)