Breaking News

World Cup 2023: వరల్డ్‌కప్‌లో దారుణ ప్రదర్శన.. పాకిస్తాన్‌ బౌలింగ్‌ కోచ్‌ రాజీనామా

Published on Mon, 11/13/2023 - 15:59

వన్డే ప్రపంచకప్‌-2023లో దారుణ ప్రదర్శన కనబరిచిన పాకిస్తాన్‌ జట్టు.. లీగ్‌ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో పాకిస్తాన్‌ బౌలింగ్‌ కోచ్‌ మోర్నీ మోర్కెల్ తన పదవికి రాజీనామా చేశాడు. ఈ ఏడాది జూన్‌లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)తో మోర్కెల్ ఆరు నెలల ఒప్పందం కుదుర్చుకున్నాడు.

ఈ ఏడాది డిసెంబర్‌ వర​కు ఇంకా సమయం ఉనప్పటికీ మోర్కెల్‌ ముందుగానే తన పదవి నుంచి తప్పుకున్నాడు. అయితే తన పదవీ కాలాన్ని పొడిగిస్తారని మొదటిలో వార్తలు విన్పించినప్పటికి..  వరల్డ్‌కప్‌లో పాక్‌ పేసర్లు దారుణంగా విఫలమకావడంతో మోర్కెల్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

ఈ ఏడాది జూలైలో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌తో పాక్‌ బౌలింగ్‌ కోచ్‌గా మోర్కెల్ ప్రయాణం మొదలైంది. ఇక మోర్కెల్‌ తప్పుకోవడంతో పాకిస్తాన్‌ బౌలింగ్‌ కోచ్‌గా ఉమర్‌ గుల్‌ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

గతంలో కూడా ఉమర్‌ గుల్‌ పాక్‌ బౌలింగ్‌ కోచ్‌గా వ్యవహరించాడు. వచ్చే నెలలో పాకిస్తాన్‌ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లానుంది. ఈ పర్యటనకు ముందు పాకిస్తాన్‌కు కొత్త బౌలింగ్‌ కోచ్‌ వచ్చే ఛాన్స్‌ ఉంది. ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో మూడు టెస్టుల సిరీస్‌లో పాక్‌ తలపడనుంది.

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)