Breaking News

అయూబ్ ఆల్‌రౌండ్ షో.. విండీస్‌ను చిత్తు చేసిన పాక్‌

Published on Fri, 08/01/2025 - 12:16

వెస్టిండీస్‌ పర్యటనను పాకిస్తాన్‌ ఘనంగా ఆరంభించింది.  ఫ్లోరిడా వేదికగా విండీస్‌తో జరిగిన తొలి టీ20లో 14 పరుగుల తేడాతో పాక్‌ విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో పాకిస్తాన్‌ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. పాక్‌ బ్యాటర్లలో సైమ్‌ అయూబ్‌(57) హాఫ్‌ సెంచరీతో చెలరేగగా.. హసన్‌ నవాజ్‌(24), ఫఖార్‌ జమాన్‌(28) రాణించారు. విండీస్‌ బౌలర్లలో షెమార్‌ జోషఫ్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. హోల్డర్‌, షెఫర్డ్‌, అకిల్‌ హోస్సేన్‌ తలా వికెట్‌ సాధించారు.

టాపర్డర్‌ ఫెయిల్‌..
అనంతరం లక్ష్య చేధనలో వెస్టిండీస్‌కు ఓపెనర్లు జాన్సెన్‌ చార్లెస్‌(35), జ్యువెల్ ఆండ్రూ(35) 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే విండీస్‌ ఒకే  ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్‌ స్వరూపమే మారిపోయింది. 12 ఓవర్‌ వేసిన స్పిన్నర్‌ మహ్మద్‌ నవాజ్‌.. ఆండ్రూ, చార్లెస్‌, మోటీలను పెవిలియన్‌కు పంపాడు. 

ఆ తర్వాత కెప్టెన్‌ షాయ్‌ హోప్‌(2), రూథర్‌ ఫర్డ్‌(11), ఛేజ్‌(5), షెఫర్డ్‌(5) వరుస క్రమంలో ఔటయ్యారు. ఆఖరిలో హోల్డర్‌(30), షమీర్‌ జోషఫ్‌(21) మెరుపులు మెరిపించినప్పటికి జరగాల్సిన నష్టం​ జరిగిపోయింది. దీంతో లక్ష్య చేధనలో విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 164 పరుగులు మాత్రమే చేయగల్గింది.

పాక్‌ బౌలర్లలో మహ్మద్‌ నవాజ్‌ మూడు, అయూబ్‌ రెండు, ముఖియమ్‌ ఓ వికెట్‌ సాధించారు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆగస్టు 2న ఫ్లోరిడా వేదికగా జరగనుంది.
చదవండి: నేను ఎప్పుడూ మోసం చేయలేదు.. సూసైడ్ ఆలోచనలూ వచ్చాయి: చాహల్‌
 

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)