Breaking News

ర‌స‌వ‌త్త‌రంగా పాక్‌-సౌతాఫ్రికా రెండో టెస్టు..

Published on Thu, 10/23/2025 - 07:57

రావల్పిండి వేదిక‌గా పాకిస్తాన్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఆధిక్యం చేతులు మారుతున్న ఈ పోరులో మూడో రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్‌ రెండో ఇన్నింగ్స్‌లో 35 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది.

మాజీ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (83 బంతుల్లో 49 బ్యాటింగ్‌; 7 ఫోర్లు), మొహమ్మద్‌ రిజ్వాన్‌ (16 బ్యాటింగ్‌) పోరాడుతున్నారు. ఇమాముల్‌ హక్‌ (9), అబ్దుల్లా షఫీఖ్‌ (6), కెపె్టన్‌ షాన్‌ మసూద్‌ (0), సౌద్‌ షకీల్‌ (11) విఫలమయ్యారు.

దక్షిణాఫ్రికా బౌలర్లలో సిమన్‌ హర్మెర్‌ 3 వికెట్లు పడగొట్టగా... రబడ ఓ వికెట్‌ తీశాడు. చేతిలో 6 వికెట్లు ఉన్న ఆతిథ్య పాకిస్తాన్‌ జట్టు... ప్రస్తుతం 23 పరుగుల ఆధిక్యంలో ఉంది. సఫారీ బౌలర్ల ధాటికి ఒక దశలో 16 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన జట్టును బాబర్‌ ఆదుకున్నాడు. కాస్త సంయమనం పాటిస్తూ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశాడు.  

ముత్తుస్వామి, రబడ మెరుపులు 
అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 185/4తో బుధవారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన దక్షిణాఫ్రికా... చివరకు 119.3 ఓవర్లలో 404 పరుగులు చేసింది. సెనురన్‌ ముత్తుస్వామి (155 బంతుల్లో 89 నాటౌట్‌; 8 ఫోర్లు) అజేయ 
అర్ధశతకంతో ఆకట్టుకోగా... కగిసో రబడ (61 బంతుల్లో 71; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అదరగొట్టాడు. పాక్‌ బౌలర్లను ఓ ఆటాడుకున్న ఈ జంట పదో వికెట్‌కు 98 పరుగులు జోడించడం విశేషం. ముత్తుస్వామి అచ్చమైన టెస్టు బ్యాటింగ్‌తో ఆకట్టుకోగా... రబడ టి20 తరహాలో రెచ్చిపోయాడు. ఎడాపెడా భారీ షాట్లు ఆడుతూ విలువైన 
పరుగులు రాబట్టాడు.

ఈ ఇద్దరికీ ఇదే కెరీర్‌ బెస్ట్‌ స్కోరు కాగా... రబడ 38 బంతుల్లోనే టెస్టుల్లో తొలి అర్ధశతకం నమోదు చేసుకున్నాడు. కేశవ్‌ మహరాజ్‌ (53 బంతుల్లో 30; 3 ఫోర్లు) కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఒకదశలో 210/7తో నిలిచిన దక్షిణాఫ్రికా... చివరి మూడు వికెట్లకు 194 పరుగులు జోడించింది. ఫలితంగా దక్షిణాఫ్రికా జట్టుకు 71 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. పాక్‌ ఫీల్డింగ్‌ తప్పిదాలు కూడా దక్షిణాఫ్రికా భారీ స్కోరుకు దోహదపడ్డాయి.
చదవండి: PKL 2025: భరత్‌ ఒంటరి పోరాటం.. హర్యానా చేతిలో తెలుగు టైటాన్స్ చిత్తు

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)