Breaking News

ధన్యవాదాలు.. పాక్‌ క్రికెట్‌తో ప్రయాణం ముగిసిపోయింది

Published on Mon, 01/08/2024 - 15:39

Pakistan Cricket Team: పాకిస్తాన్‌ హై పర్ఫామెన్స్‌ కోచ్‌ గ్రాంట్‌ బ్రాడ్‌బర్న్‌ తన పదవికి రాజీనామా చేశాడు. పాకిస్తాన్‌ క్రికెట్‌తో తన ప్రయాణం ముగిసిందని వెల్లడించాడు. ఐదేళ్లకు పైగా మూడు భిన్న పాత్రలు పోషించానన్న బ్రాడ్‌బర్న్‌.. ఇక తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.

కాగా పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు న్యూజిలాండ్‌ మాజీ బ్యాటర్‌ గ్రాంట్‌ బ్రాడ్‌బర్న్‌ను రెండేళ్ల కాలానికి గానూ తొలుత హెడ్‌కోచ్‌గా నియమించుకుంది పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు. మే, 2023లో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే, భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌-2023లో పాక్‌ జట్టు కనీసం సెమీస్‌ కూడా చేరకుండానే నిష్క్రమించిన విషయం తెలిసిందే.

తన మార్కు చూపిస్తున్న హఫీజ్‌
ఈ నేపథ్యంలో బాబర్‌ ఆజం కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ హఫీజ్‌ ప్రక్షాళన చర్యలకు పూనుకున్నాడు. ఇందులో భాగంగా కోచింగ్‌ సిబ్బంది ఫోర్ట్‌పోలియోలు మార్చాడు. ఈ క్రమంలో బ్రాడ్‌బర్న్‌ హై పర్ఫామెన్స్‌ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించగా.. ఇటీవల అతడి స్థానంలో పాక్‌ మాజీ ఆల్‌రౌండర్‌ యాసిర్‌ అరాఫత్‌ను నియమించాడు.

పాక్‌తో ప్రయాణం ముగిసిపోయింది
ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో పాకిస్తాన్‌ టీ20 సిరీస్‌ నుంచి యాసిర్‌ సేవలను వినియోగించుకోనున్నట్లు పీసీబీ తెలిపింది. దీంతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు బ్రాడ్‌బర్న్‌ తాజాగా ప్రకటన విడుదల చేశాడు. ‘‘చాలా చాలా ధన్యవాదాలు. 

పాకిస్తాన్‌ క్రికెట్‌తో అద్భుతమైన అధ్యాయం ముగిసిపోయింది. అద్భుతమైన ఆటగాళ్లు, కోచ్‌లు, సిబ్బందితో పనిచేసినందుకు గర్వంగా ఉంది. పాకిస్తాన్‌ క్రికెట్‌ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా’’ అని గ్రాంట్‌ బ్రాడ్‌బర్న్‌ ఎక్స్‌ వేదికగా నోట్‌ షేర్‌ చేశాడు. అతడు ఇంగ్లండ్‌ కౌంటీ జట్టు గ్లామోర్గాన్‌ హెడ్‌కోచ్‌గా నియమితుడైనట్లు సమాచారం.

కాగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం పాకిస్తాన్‌ న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లింది. ఈ టూర్‌తో కెప్టెన్‌గా షాహిన్‌ ఆఫ్రిది బాధ్యతలు స్వీకరించనుండగా.. వైస్‌ కెప్టెన్‌గా మహ్మద్‌ రిజ్వాన్‌ నియమితుడయ్యాడు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

కృష్ణాష్టమి సెలబ్రేషన్.. కిరణ్ అబ్బవరం కొడుకు ఇలా (ఫొటోలు

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)