Breaking News

'బాబర్‌ నీ పని అయిపోయింది.. వెళ్లి జింబాబ్వేలో ఆడుకో'

Published on Mon, 09/02/2024 - 13:25

పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం పేలవ ఫామ్ కొనసాగుతోంది. రావల్పిండి వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో బాబర్ దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 31 ప‌రుగులు చేసిన ఆజం.. రెండో ఇన్నింగ్స్‌లో కేవ‌లం 11 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔట‌య్యాడు. 

జ‌ట్టు క‌ష్టాల్లో ఉన్న స‌మ‌యంలో క్రీజులో వ‌చ్చిన బాబార్ మ‌రోసారి నిరాశ‌ప‌రిచాడు. చెత్త షాట్ ఆడుతూ స్లిప్‌లో దొరికిపోయాడు. పాక్ సెకెండ్ ఇన్నింగ్స్ 19 ఓవ‌ర్ వేసిన  పేసర్ నహిద్ రానా తొలి బంతిని బాబ‌ర్‌కు బ్యాక్ ఆఫ్ లెంగ్త్ డెల‌వ‌రీగా ఆఫ్ సైడ్ సంధించాడు. అయితే బంతిని స‌రిగ్గా అంచ‌నా వేయ‌లేక‌పోయిన ఆజం.. స్లిప్‌లో షాద్‌మాన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది.

 క‌నీసం హాఫ్ సెంచ‌రీ కూడా..
కాగా బాబ‌ర్ టెస్టుల్లో హాఫ్ సెంచరీ మార్క్ దాట‌డానికి తెగ క‌ష్ట‌ప‌డుతున్నాడు.  ఆజం టెస్టుల్లో హాఫ్ సెంచ‌రీ సాధించి దాదాపు 20 నెల‌లు దాటింది. అత‌డు చివ‌ర‌గా డిసెంబర్ 2022లో న్యూజిలాండ్‌పై 161 పరుగులు చేశాడు. అప్ప‌టి నుంచి హాఫ్ సెంచరీ మార్క్‌ను దాట‌లేక‌పోతున్నాడు. 

జ‌న‌వ‌రి 2023 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు 16 టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడిన ఆజం.. 21.33 స‌గ‌టుతో కేవ‌లం 331 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. ఈ క్ర‌మంలో బాబ‌ర్‌ను నెటిజ‌న్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. వెళ్లి జింబాబ్వేలో ఆడుకో అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)