Breaking News

ఎట్ట‌కేల‌కు 12 ఏళ్ల తర్వాత ఇలా.. సంతోషంగా ఉంది!

Published on Tue, 05/14/2024 - 13:53

India's 85th chess Grandmaster- దుబాయ్‌: ఒకటి కాదు... రెండు కాదు... మూడు కాదు... ఏకంగా 12 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అనుకున్నది సాధించాడు తమిళనాడు చెస్‌ ప్లేయర్‌ శ్యామ్‌ నిఖిల్‌. 31 ఏళ్ల శ్యామ్‌ నిఖిల్‌భారత చెస్‌లో 85వ గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం)గా అవతరించాడు. 

జీఎం హోదా దక్కాలంటే చెస్‌ ప్లేయర్‌ 2500 ఎలో రేటింగ్‌ను దాటడంతోపాటు మూడు జీఎం నార్మ్‌లు సాధించాలి. ఈ రెండూ సాధ్యమైతేనే జీఎం హోదా లభిస్తుంది. 2012లోనే శ్యామ్‌ 2500 ఎలో రేటింగ్‌ను అందుకోవడంతోపాటు రెండు జీఎం నార్మ్‌లు సాధించాడు. అయితే చివరిదైన మూడో జీఎం నార్మ్‌ కోసం సుదీర్ఘంగా నిరీక్షించాల్సి వ‌చ్చింది.

12 ఏళ్లపాటు వేచి చూశాక ఎట్టకేలకు శ్యామ్‌ నిఖిల్‌ దుబాయ్‌ పోలీస్‌ మాస్టర్స్‌ ఓపెన్‌ చెస్‌ టోర్నీలో జీఎం హోదా ఖరారు కావడానికి అవసరమైన మూడో జీఎం నార్మ్‌ను అందుకున్నాడు. ఈ టోర్నీలో శ్యామ్‌ నిఖిల్‌ ఐదు పాయింట్లతో 39వ ర్యాంక్‌లో నిలిచాడు. 

చాలా సంతోషంగా ఉంది
ఈ క్రమంలో ఏడుగురు గ్రాండ్‌మాస్టర్లతో తలపడిన శ్యామ్‌ ఒకరిపై గెలిచి, ఆరుగురితో ‘డ్రా’ చేసుకొని మూడో జీఎం నార్మ్‌ను సాధించాడు. ‘ఎనిమిదేళ్ల వయస్సులో చెస్‌ ఆడటం ప్రారంభించాను. అయితే మూడేళ్లపాటు ఏ టోర్నీలోనూ ఆడలేదు. ఆ తర్వాత అండర్‌–13 రాష్ట్ర చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాను. 

2012లోనే రెండు జీఎం నార్మ్‌లు అందుకున్నా మూడో జీఎం నార్మ్‌ సులభంగా రాలేదు. పలుమార్లు చేరువై దూరమయ్యాను. ఎట్టకేలకు 12 ఏళ్ల తర్వాత మూడో జీఎం నార్మ్‌ అందుకోవడంతో చాలా సంతోషంగా ఉంది’ అని 2022లో కామన్వెల్త్‌ చాంపియన్‌గా నిలిచిన శ్యామ్‌ నిఖిల్‌ వ్యాఖ్యానించాడు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి