Breaking News

OTD: లారా రికార్డు బద్దలు కొట్టిన సచిన్‌.. టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే..

Published on Tue, 10/17/2023 - 16:49

Sachin Tendulkar- history Test cricket: క్రికెట్‌లో రికార్డులకు మారుపేరు సచిన్‌ టెండుల్కర్‌. రెండు దశాబ్దాలకు పైగా కొనసాగిన తన సుదీర్ఘ కెరీర్‌లో మాస్టర్‌ బ్లాస్టర్‌ లెక్కనేనన్ని ఘనతలు సాధించాడు. అంతర్జాతీయ కెరీర్‌లో వంద సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్‌గా నేటికీ కొనసాగుతూ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు.

ప్రస్తుత తరం బ్యాటర్లలో ఎవరు ఏ రికార్డు సాధించినా అందులో సగం వరకు సచిన్‌ పేరుతో ముడిపడి ఉంటాయంటే ఈ టీమిండియా లెజెండ్‌ రేంజ్‌ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. 

క్రికెట్‌ను పెద్దగా ఇష్టపడని వాళ్లకు సైతం ఆయన పేరు సుపరిచితమే. మరి అలాంటి.. మన క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండుల్కర్‌ కెరీర్‌లో అక్టోబరు 17కు ఉన్న ప్రాముఖ్యత గురించి మీకు తెలుసా?

సరిగ్గా ఇదే రోజు..
2008లో సరిగ్గా ఇదే రోజు.. మొహాలీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో టెస్టు సందర్భంగా సచిన్‌ తన కెరీర్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఆసీస్‌తో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌ సందర్భంగా.. కంగారూ జట్టు పేసర్‌ పీటర్‌ సిడెల్‌ బౌలింగ్‌లో.. గల్లీ దిశగా బంతిని తరలించాడు సచిన్‌.

లారా రికార్డు బద్దలు కొట్టిన సచిన్‌
ఈ క్రమంలో మూడు పరుగులు సాధించిన లిటిల్‌ మాస్టర్‌.. వెస్టిండీస్‌ దిగ్గజం బ్రియన్‌ లారా పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.

ఈ మ్యాచ్‌ ముందు వరకు 11,953 పరుగులతో లారా అగ్రస్థానంలో ఉండేవాడు. ఇక 2006లోనే ఈ విండీస్‌ లెజెండ్‌ టెస్టు క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పగా.. 2008లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌‌ సందర్భంగా సచిన్‌ టెస్టుల్లో ఆల్‌టైమ్‌ లీడ్‌ రన్‌స్కోరర్‌గా అవతరించాడు. 

ఆసీస్‌ ఆటగాళ్ల అభినందనలు
ఇక కెరీర్‌లో అరుదైన ఘనత సాధించిన సచిన్‌ టెండుల్కర్‌కు నాడు మొహాలీ ప్రేక్షకులు హర్షధ్వానాలతో జేజేలు పలికారు. నాటి ఆసీస్‌ కెప్టెన్‌ రిక్కీ పాంటింగ్‌ సహా ఇతర ఆటగాళ్లు సచిన్‌ దగ్గరకు వచ్చి అభినందనలు తెలిపారు. 

వంద శతకాల వీరుడు.. వన్డేల్లో డబుల్‌ సెంచరీ సాధించిన ఘనుడు
కాగా 152 టెస్టులో సచిన్‌ టెండుల్కర్‌ 11955 పరుగులతో లారాను అధిగమించగా.. లారా 131 మ్యాచ్‌లలోనే 11953 రన్స్‌ సాధించాడు. అప్పటికి సచిన్‌ అత్యుత్తమ స్కోరు 248 నాటౌట్‌ కాగా.. లారా స్కోరు 400- నాటౌట్‌.

ఇక తన 24 ఏళ్ల కెరీర్‌లో సచిన్‌ టెండుల్కర్‌ మొత్తంగా 200 టెస్టుల్లో 15921, 463 వన్డేల్లో 18426, ఒక టీ20లో 10 పరుగులు సాధించాడు. టెస్టుల్లో అతడి అత్యుత్తమ స్కోరు 248 కాగా.. వన్డేల్లో 200. టెస్టు సెంచరీలు 51. వన్డే సెంచరీలు 49.

చదవండి: టీమిండియాతో మ్యాచ్‌.. బంగ్లాదేశ్‌కు భారీ షాక్‌!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)