Breaking News

పియాస్ట్రి... మళ్లీ గెలిచాడు

Published on Mon, 04/14/2025 - 01:38

సాఖిర్‌ (బహ్రెయిన్‌): క్వాలిఫయింగ్‌లో కనబరిచిన జోరును ప్రధాన రేసులోనూ కొనసాగించిన మెక్‌లారెన్‌ జట్టు డ్రైవర్‌ ఆస్కార్‌ పియాస్ట్రి ఈ సీజన్‌లో రెండో విజయాన్ని అందుకున్నాడు. ఫార్ములావన్‌ 2025 సీజన్‌లో భాగంగా ఆదివారం జరిగిన సీజన్‌ నాలుగో రేసు బహ్రెయిన్‌ గ్రాండ్‌ప్రిలో పియాస్ట్రి విజేతగా నిలిచాడు. ‘పోల్‌ పొజిషన్‌’తో రేసును ఆరంభించిన ఆ్రస్టేలియాకు చెందిన పియా్రస్టి... నిర్ణీత 57 ల్యాప్‌లను అందరికంటే వేగంగా, అందరికంటే ముందుగా 1 గంట 35 నిమిషాల 39.435 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 

ఈ సీజన్‌లో చైనా గ్రాండ్‌ప్రిలోనూ పియాస్ట్రి టైటిల్‌ సాధించాడు. మెర్సిడెస్‌ జట్టుకు చెందిన జార్జి రసెల్‌ రెండో స్థానాన్ని పొందగా... మెక్‌లారెన్‌కే చెందిన లాండో నోరిస్‌ మూడో స్థానంలో నిలిచాడు. గత నాలుగేళ్లుగా ప్రపంచ చాంపియన్‌గా నిలుస్తున్న రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ ఆరో స్థానంతో సరిపెట్టుకోగా... ఫెరారీ తరఫున తొలిసారి బరిలోకి దిగిన లూయిస్‌ హామిల్టన్‌ ఐదో స్థానాన్ని సాధించాడు. 

24 రేసుల ఈ సీజన్‌లో నాలుగు రేసులు పూర్తయ్యాయి. 77 పాయింట్లతో లాండో నోరిస్‌ అగ్ర స్థానంలో... 74 పాయింట్లతో ఆస్కార్‌ పియాస్ట్రి రెండో స్థానంలో... వెర్‌స్టాపెన్‌ 69 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నారు. సీజన్‌లోని ఐదో రేసు సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రి ఈనెల 20న జిద్దా నగరంలో జరుగుతుంది. 

#

Tags : 1

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)