ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం
Breaking News
హెచ్సీఏ నూతన అధ్యక్షుడిగా అమర్నాథ్
Published on Tue, 02/03/2026 - 07:31
హైదరాబాద్ క్రికెట్ అసోయేషిన్ అధ్యుక్షుడిగా అమర్నాథ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఈ మేరకు రిటైర్డ్ చీఫ్ జస్టిస్, ప్రస్తుత అంబుడ్స్మన్ సురేష్ కుమార్ కైత్ ఉత్తర్వలు జారీ చేశారు. 2023లో జరిగిన ఎన్నికల్లో జగన్ మోహన్ రావ్ చేతిలో అమర్నాథ్ కేవలం ఒక్క ఓటుతో ఓడిపోయాడు.
అయితే ఈ ఎన్నికల్లో విజయం సాధించిన జగన్ మోహన్ రావ్ అవినీతి ఆరోపణలు కేసులో అరెస్ట్ అయ్యాడు. అతడు ప్రస్తుతం బెయిల్పై ఉన్నాడు. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు అతడు అర్హుడు కాదని అంబుడ్స్మన్ స్పష్టం చేసింది.
దీంతో హెచ్సీఏ అధ్యక్ష బాధ్యతలను అమర్నాథ్కు అప్పగించారు. ప్రస్తుతం హెచ్సీఏ తాత్కాలిక అధ్యక్షుడిగా సర్దార్ దల్జీత్ సింగ్ ఉన్నారు. మరో వారం రోజుల్లో అతడి స్ధానాన్ని అమర్నాథ్ భర్తీ చేయనున్నారు. ఐపీఎల్ సమీపిస్తుండటంతో ఈ నూతన ప్రెసిడెంట్ నియమాకం అనివార్యమైంది.
దాదాపు ఏడాది నుంచి హైదరాబాద్లోని ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా జరగలేదు. ఆఖరికి ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ హోం మ్యాచ్లను కూడా వేరే చోటకు తరలించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అమర్నాథ్ కొత్త ప్రెసిడెంట్గా ఎంపిక కావడంతో పరిస్థితులు మారే అవకాశముంది.
చదవండి: T20 WC 2026: రీఎంట్రీలో అదరగొట్టిన తిలక్ వర్మ
Tags : 1