Breaking News

12 ఏళ్ల త‌ర్వాత తొలి సూప‌ర్ ఓవ‌ర్‌.. న‌మీబియా వ‌ర‌ల్డ్ రికార్డు

Published on Mon, 06/03/2024 - 14:08

టీ20 వరల్డ్‌కప్‌-2024 టోర్నీలోని మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి.  టోర్నీ ఆరంభ మ్యాచ్‌లోనే 195 పరుగులను ఛేదించి అందరని షాక్‌కు గురిచేసింది. ఆ తర్వాతి మ్యాచ్‌లో ఆతిథ్య వెస్టిండీస్‌ను పసికూన పపువా న్యూ గినియా ఓడించే అంతా పనిచేసింది.

ఇక రెండు మ్యాచ్‌లు ఒక ఎత్తు. సోమ‌వారం బార్బోడ‌స్ వేదిక‌గా ఒమ‌న్‌-న‌మీబియా మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ ఒక ఎత్తు. ఒమ‌న్‌-న‌మీబియా మ్యాచ్‌ అభిమానుల‌ను మునివేళ్ల‌పై నిల‌బెట్టింది. ఇరు జ‌ట్లు స‌మాన స్ధాయిలో పోరాడ‌డంతో మ్యాచ్ సూప‌ర్ ఓవ‌ర్‌కు దారి తీసింది.  

సూప‌ర్ ఓవ‌ర్‌లో ఒమ‌న్‌పై ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లోలో తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్.. మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 109 పరుగులకు కుప్పకూలింది. అనంత‌రం ఒమ‌న్ బౌల‌ర్లు కూడా క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయ‌డంతో న‌మీబియా కూడా సరిగ్గా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 109 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. దీంతో సూప‌ర్ ఓవ‌ర్‌లో ఫ‌లితం తేల్చాల్సి వ‌చ్చింది.

దంచి కొట్టిన డేవిడ్ వీస్‌, ఎరాస్మస్..
ఇక సూప‌ర్ ఓవ‌ర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న‌మీబియా 21 ప‌రుగుల చేసింది. న‌మీబియా బ్యాట‌ర్ల‌లో డేవిడ్ వీస్ 13 ప‌రుగులు చేయ‌గా.. ఎరాస్మస్ 8 ప‌రుగులు చేశాడు. సూప‌ర్ ఓవ‌ర్‌లో బ్యాటింగ్‌లో అద‌ర‌గొట్టిన డేవిడ్ వీస్‌.. బౌలింగ్‌లో కూడా స‌త్తాచాటాడు.

తొలి రెండు బంతులకు 2, 0 రాగా.. మూడో బంతికి నమీస్ కుషిని క్లీన్ బౌల్డ్ చేశాడు.  అనంత‌రం  రెండు బంతులకు ఒక్కో పరుగు చొప్పున ఇచ్చి వీస్ జ‌ట్టు విజ‌యాన్ని లాంఛనం చేశాడు. ఆఖ‌రి బంతికి సిక్స్ ఇచ్చిన‌ప్ప‌టికి ఒమ‌న్‌కు చేయాల్సిన న‌ష్టం వీస్ చేసేశాడు.

12 ఏళ్ల త‌ర్వాత తొలి సూప‌ర్ ఓవ‌ర్‌..
కాగా టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో సూప‌ర్ ఓవ‌ర్ జ‌ర‌గ‌డం ఇది మూడో సారి. చివ‌ర‌గా 2012 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో సూప‌ర్ ఓవ‌ర్ జ‌రిగింది. 2012 పొట్టి ప్రపంచకప్‌లో కాండీ వేదికగా శ్రీలంక, న్యూజిలాండ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌ ద్వారానే ఫలితం తేలింది.

 అదే వరల్డ్‌కప్‌లో వెస్టిండీస్‌, కివీస్‌ మ్యాచ్‌ కూడా సూపర్‌ ఓవర్ దారితీసింది. కాగా 2007 టీ20 వరల్డ్‌కప్‌లో భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ టై అయినప్పటికి సూపర్‌ ఓవర్‌ ద్వారా కాకుండా బాల్‌ అవుట్‌ ద్వారా ఫలితం తేల్చారు.

నమీబియా అరుదైన రికార్డు..
ఇక సూపర్ ఓవర్‌లో విజయం సాధించిన నమీబియా అరుదైన రికార్డు సాధించింది. టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో సూపర్ ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా నమీబియా రికార్డులకెక్కింది. ఒమన్‌తో మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో నమీబియా ఏకంగా 21 పరుగులు సాధించింది.

అంతకుముందు ఈ రి​కార్డు వెస్టిండీస్ పేరిట ఉండేది. 2012 టీ20 ప్రపంచకప్‌లో కివీస్‌పై సూపర్ ఓవర్‌లో విండీస్ 19 పరుగులు చేసింది. తాజా మ్యాచ్‌తో విండీస్ రికార్డును నమీబియా బ్రేక్ చేసింది.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)