Breaking News

తొలిసారి ఆసియా కప్‌ బరిలో ఒమన్‌

Published on Fri, 02/28/2025 - 04:17

న్యూఢిల్లీ: ఆసియాకప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో ఈసారి 8 జట్లు పాల్గొననున్నాయి. ఒమన్‌ జట్టు తొలిసారి ఆసియా కప్‌ టోర్నీకి అర్హత సాధించింది. గత ఏడాది జరిగిన ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) ప్రీమియర్‌ కప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలువడం ద్వారా యూఏఈ, ఒమన్‌ జట్లు ఆసియా కప్‌ టోర్నీకి అర్హత పొందాయి. ఈ రెండు జట్లతోపాటు హాంకాంగ్‌ జట్టు కూడా ఆసియా కప్‌లో ఆడనుంది. 2026లో టి20 ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యలో ఈసారి ఈ టోర్నీని టి20 ఫార్మాట్‌లో నిర్వహిస్తారు. 

2023 వన్డే ప్రపంచకప్‌నకు ముందు జరిగిన ఆసియా కప్‌ను వన్డే ఫార్మాట్‌లో నిర్వహించారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆసియా కప్‌ జరిగే అవకాశమున్నట్లు ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) వర్గాలు వెల్లడించాయి. ఆసియా కప్‌ ఆతిథ్య హక్కులు భారత్‌ వద్ద ఉన్నప్పటికీ... తటస్థ వేదికపై టోర్నీ జరగనుంది. 

ప్రస్తుతం పాకిస్తాన్‌ ఆతిథ్యమిస్తున్న ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో ఆడేందుకు రోహిత్‌ శర్మ సారథ్యంలోని భారత జట్టు పాకిస్తాన్‌కు వెళ్లకుండా... దుబాయ్‌లోనే అన్నీ మ్యాచ్‌లు ఆడుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో పాకిస్తాన్‌ జట్టు కూడా భారత్‌లో పర్యటించబోమని గతంలోనే వెల్లడించింది. దీంతో ఆసియా కప్‌ను యూఏఈ, శ్రీలంకలో నిర్వహించనున్నారు. ఆసియా కప్‌ చరిత్రలో భారత్‌ 8 సార్లు విజేతగా నిలిచి విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)