Breaking News

Olympics: సెమీస్‌లో వినేశ్‌.. పతకం ఖాయం చేసే దిశగా

Published on Tue, 08/06/2024 - 16:27

ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024లో భారత మహిళా రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ మరో సంచలన విజయం సాధించింది. మహిళల 50 కేజీల విభాగంలో సెమీ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ప్రిక్వార్టర్స్‌లో వరల్డ్‌ నంబర్‌ వన్‌, టోక్యో స్వర్ణ పతక విజేత సుసాకేకు షాకిచ్చిన వినేశ్‌.. క్వార్టర్‌ ఫైనల్లో అడుగుపెట్టింది.

ఈ క్రమంలో ఉక్రెయిన్‌ రెజ్లర్‌ లివాచ్‌తో తలపడ్డ వినేశ్‌ ఫొగట్‌.. శుభారంభం చేసింది. 4-0తో లీడ్‌లోకి వెళ్లింది. అయితే, లివాచ్‌ కూడా అంత తేలికగా తలొగ్గలేదు. ఈ క్రమంలో తన శక్తినంతటినీ ధారపోసిన వినేశ్‌ ఫొగట్‌.. ఆఖరికి లివాచ్‌ను 7-5తో ఓడించి సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టింది.

వినేశ్‌ ఫొగట్‌ తదుపరి క్యూబాకు చెందిన రెజ్లర్‌ యుస్నెలిస్‌ గుజ్‌మాన్‌ లోపెజ్‌తో సెమీ పోరులో తలపడనుంది. మంగళవారం రాత్రి 10.15 నిమిషాలకు ఈ బౌట్‌ ఆరంభం కానుంది. 

కాగా వినేశ్‌ ఫొగట్‌ ప్రస్తుతం వరల్డ్‌ నంబర్‌ 65 ర్యాంకర్‌ కాగా.. వరుసగా వరల్డ్‌ నంబర్‌ వన్‌ సుసాకే, ఎనిమిదో సీడ్‌ లివాచ్‌లను ఓడించి... తన కెరీర్‌లో తొలిసారిగా ఒలింపిక్స్‌ సెమీస్‌కు చేరుకుంది. రియో 2016లో క్వార్టర్‌ ఫైనల్లోనే వెనుదిరిగిన వినేశ్‌.. టోక్యో 2020 ఒలింపిక్స్‌లో రెండో రౌండ్‌లోనే ఓడిపోయి.. రిక్తహస్తాలతో తిరిగి వచ్చింది.

చదవండి: Olympics 2024: ఫైనల్లో నీరజ్‌ చోప్రా

 

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

రోమాంచకం హీరోయిన్ అనంతిక గ్లామరస్ లుక్స్.. ఫోటోలు

+5

అమెరికా ట్రిప్‌లో బుట్టబొమ్మ పూజా హెగ్డే చిల్.. ఫోటోలు

+5

'ఇరుముడి'లో చీరతో.. ఇప్పుడేమో స్టైలిష్‌గా (ఫొటోలు)

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)