Breaking News

Olympics: ఒక్క పాయింట్‌.. భారత్‌ చేజారిన కాంస్యం

Published on Mon, 08/05/2024 - 18:59

భారత షూటర్లు అనంత్‌ జీత్‌ సింగ్‌ నరౌకా- మహేశ్వరి తృటిలో కాంస్యం చేజార్చుకున్నారు. స్కీట్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌ కాంస్య పతక పోరుకు అర్హత సాధించిన భారత ద్వయం.. మెడల్‌ కోసం చైనాతో జరిగిన ప్లే ఆఫ్స్‌లో ఆఖరి వరకు పోరాడింది.

అయితే, ఆరంభంలో కాస్త తడబడ్డా భారత జోడీ తిరిగి పుంజుకుంది. కానీ..ఆది నుంచి పొరపాట్లకు తావివ్వని చైనా జోడీ జియాంగ్‌ యితింగ్‌- లియు జియాన్లిన్‌ పతకం ఖాయం చేసుకున్నారు. ఫలితంగా.. ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024లో స్కీట్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో నాలుగో స్థానానికి పరిమితమైన అనంత్‌ జీత్‌ సింగ్‌ నరౌకా- మహేశ్వరి రిక్తహస్తాలతో వెనుదిరగనున్నారు.

స్కీట్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌ బ్రాంజ్‌ మెడల్‌ ప్లే ఆఫ్‌ జరిగిందిలా
రెండు జోడీలు... తలా నాలుగు షాట్లు.. షాట్‌లో సఫలమైతే ఒక్కో షూటర్‌కు ఒక్కో పాయింట్‌
👉ఫస్ట్‌ స్టేషన్‌
రెండు జోడీల్లో కలిపి అనంత్‌ జీత్‌ సింగ్‌ ఒక్కడి షాట్‌ మిస్‌
ఇండియా 7 పాయింట్లు- చైనా ఎనిమిది పాయింట్లు

👉సెకండ్‌ స్టేషన్‌
మహేశ్వరి, అనంత్‌ ఒక్కో షాట్‌ మిస్‌
యితింగ్‌ మూడు షాట్లు మిస్‌
13- 13తో స్కోరు సమం చేసిన భారత్‌

👉థర్డ్‌ స్టేషన్‌
మహేశ్వరి, యితింగ్‌ ఒక్కో షాట్‌ మిస్‌
20-20తో సమంగా భారత్‌- చైనా

👉ఫోర్త్‌ స్టేషన్‌
నాలుగు షాట్లలో అనంత్‌ సఫలం
ఒక షాట్‌ మిస్‌ అయిన మహేశ్వరి
చైనా జోడీకి ఎనిమిదికి ఎనిమిది పాయింట్లు
స్కోరు: 28-27తో ముందంజలో చైనా

👉ఫిఫ్త్‌ స్టేషన్‌
మహేశ్వరి- అంకిత్‌.. నాలుగు షాట్లలో నాలుగూ సఫలం
చైనా జోడీ కూడా అన్ని షాట్లలో సఫలం
36-35తో ఆధిక్యంలో చైనా

👉సిక్త్స్‌ స్టేషన్‌
నాలుగు షాట్లలో సఫలమై ఎనిమిది పాయింట్లు సాధించిన చైనా జోడీ.. ఓవరాల్‌గా 44 పాయింట్లు
నాలుగు షాట్లలో సఫలమై ఎనిమిది పాయింట్లు సాధించిన భారత జోడీ.. ఓవరాల్‌గా 43 పాయింట్లు
ఒక్క పాయింట్‌ తేడాతో భారత జోడీ చేజారిన కాంస్యం. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)