Breaking News

124 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన మనూ భాకర్‌.. అత్యంత అరుదైన ఘనత

Published on Tue, 07/30/2024 - 13:29

విశ్వ క్రీడల్లో భారత షూటర్‌ మనూ భాకర్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌లో ఒకే ఎడిషన్‌లో రెండు పతకాలు గెలిచిన భారత తొలి ఇండియన్‌ అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. ప్యారిస్‌ ఒలింపిక్స్‌-2024లో 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ షూటింగ్‌ మహిళల విభాగంలో 22 ఏళ్ల మనూ కాంస్య పతకం గెలిచిన విషయం తెలిసిందే.

మిక్స్‌డ్‌ టీమ్‌ షూటింగ్‌ ఈవెంట్లో
తద్వారా భారత్‌కు ఈ ఎడిషన్‌లో తొలి పతకాన్ని అందించిన అథ్లెట్‌గా మనూ నిలిచింది. తాజాగా  మంగళవారం 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ షూటింగ్‌ ఈవెంట్లో సరబ్‌జోత్‌ సింగ్‌తో కలిసి మరోసారి కాంస్య పతకాన్ని అందుకుంది. దక్షిణ కొరియా జోడీని ఓడించి ఈ జంట మెడల్‌ను కైవసం చేసుకుంది.

124  ఏళ్ల క్రితం
ఈ క్రమంలో భారత్‌ తరఫున ఒలింపిక్స్‌ సింగిల్‌ ఎడిషన్‌లో రెండు పతకాలు సాధించిన మనూ.. ఈ ఘనత అందుకున్న ప్యూర్‌ ఇండియన్‌గా  రికార్డులకెక్కింది. అంతకు ముందు 1900 ఒలింపిక్స్‌లో బ్రిటిష్‌- ఇండియన్‌ నార్మన్‌ ప్రిచార్డ్‌ ఈ ఫీట్‌ నమోదు చేశాడు. 200 మీటర్ల పరుగు, 200 మీటర్ల హార్డిల్స్‌లో రజతాలు సాధించాడు. ఈ క్రమంలో భారత్‌ తరఫున 124 ఏళ్ల తర్వాత హరియాణా అమ్మాయి మనూ భాకర్‌ ఈ రికార్డు బద్దలు కొట్టింది.

చదవండి: నాడు కోచ్‌తో మనూ గొడవ.. శాపం పోయిందంటూ రాణా సంతోషం

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)