Breaking News

Official: షాహిన్‌పై వేటు.. పాక్‌ కెప్టెన్‌గా మళ్లీ బాబర్‌ ఆజం

Published on Sun, 03/31/2024 - 11:36

PCB Announces Babar Azam appointed as white-ball captain: పాకిస్తాన్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా స్టార్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజం పునర్నియమితుడయ్యాడు. వన్డే, టీ20 జట్ల సారథిగా మరోసారి పగ్గాలు చేపట్టనున్నాడు. ఈ మేరకు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది. సెలక్షన్‌ కమిటీ ఏకగ్రీవ తీర్మానం మేరకు బాబర్‌ ఆజంను తిరిగి కెప్టెన్‌గా నియమించినట్లు తెలిపింది.

సెమీస్‌ కూడా చేరకుండా నిష్క్రమించడంతో
కాగా వన్డే ప్రపంచకప్‌-2023లో పాకిస్తాన్‌ దారుణ వైఫల్యం నేపథ్యంలో బాబర్‌ ఆజం కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. భారత్‌ వేదికగా జరిగిన ఈ మెగా టోర్నీలో బ్యాటర్‌గానూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోవడంతో.. బాబర్‌ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోవాలంటూ మాజీ క్రికెటర్లు సూచించారు.

అప్పటి పీసీబీ పెద్దలు సైతం బాబర్‌ ఆజంకు మద్దతుగా నిలవకపోవడంతో అతడు కెప్టెన్‌గా తప్పుకొన్నాడు. అతడి స్థానంలో టీ20లకు కెప్టెన్‌గా ప్రధాన పేసర్‌ షాహిన్‌ ఆఫ్రిది, టెస్టులకు షాన్‌ మసూద్‌లను సారథులుగా ఎంపిక చేశారు.

ఘోర పరాజయాలు
ఈ క్రమంలో షాన్‌ మసూద్‌ నేతృత్వంలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన పాక్‌.. కంగారూల చేతిలో టెస్టు సిరీస్‌లో 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. అదే విధంగా షాహిన్‌ సారథ్యంలో న్యూజిలాండ్‌ పర్యటనలో టీ20 సిరీస్‌లో 4-1తో చిత్తుగా ఓడింది. ఈ నేపథ్యంలో పీసీబీ నిర్ణయాలపై విమర్శలు వచ్చాయి.

ఆఫ్రిదిపై వేటు.. మసూద్‌ కొనసాగింపు!
ఇక షాహిన్‌ ఆఫ్రిది పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌లోనూ పూర్తిగా నిరాశపరిచాడు. ఈ క్రమంలో పీసీబీ చీఫ్‌గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన మొహ్సిన్‌ నఖ్వీ కీలక నిర్ణయం తీసుకున్నాడు. సెలక్షన్‌ కమిటీ సిఫారసు మేరకు బాబర్‌ ఆజంను వన్డే, టీ20ల కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు ప్రకటించాడు.

అయితే, టెస్టులకు మాత్రం షాన్‌ మసూద్‌నే సారథిగా కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. కాగా పాకిస్తాన్‌ జట్టు తదుపరి ఏప్రిల్‌ 18 నుంచి స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌తో బాబర్‌ ఆజం నాయకుడిగా తన ప్రస్థానాన్ని తిరిగి మొదలుపెట్టనున్నాడు. 

చదవండి: #Mayank Yadav: ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ డెలివరీ.. ఎవరీ మయాంక్ యాదవ్‌?

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)