Breaking News

అన్ని అస్త్రాలతో సిద్ధం

Published on Sat, 09/30/2023 - 02:51

గువహటి: ఆసియా కప్‌లో విజేత, ఆపై ఆ్రస్టేలియాలాంటి పటిష్టమైన జట్టుపై సిరీస్‌ విజయం... సరిగ్గా చెప్పాలంటే వన్డే వరల్డ్‌ కప్‌కు ముందు భారత జట్టుకు సరైన సన్నాహకం లభించింది. కొత్తగా టీమిండియా ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో పరీక్షించుకునేందుకు ఏమీ లేదు. వరల్డ్‌ కప్‌ జట్టులోని ఆటగాళ్లంతా సత్తా చాటి తమ స్థానాలను ఖాయం చేసుకోగా, చివరి నిమిషంలో జట్టుతో చేరిన అశి్వన్‌ కూడా ఆసీస్‌తో తొలి రెండు వన్డేల్లో తన విలువేంటో చూపించాడు.

అయితే ప్రపంచకప్‌కు ముందు మరో అగ్రశ్రేణి జట్టుతో పోరు అంటే ఉదాసీనతకు తావు లేకుండా మరోసారి తమ అ్రస్తాలను చక్కదిద్దుకునేందుకు ఉపకరిస్తుంది. ఈ నేపథ్యంలో నేడు తమ తొలి వామప్‌ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌తో భారత్‌ తలపడనుంది. తమ రెండో వామప్‌ మ్యాచ్‌లో చిన్న జట్టయిన నెదర్లాండ్స్‌ ప్రత్యర్థి కావడంతో ఈ తొలి పోరు టీమిండియాకు సరైన సాధన కానుంది. రాజ్‌కోట్‌ నుంచి నేరుగా గువహటి చేరిన భారత జట్టుకు శుక్రవారం ఆప్షనల్‌ ప్రాక్టీస్‌కు అవకాశం ఇచ్చారు. అయితే నలుగురు భారత ఆటగాళ్లు గిల్, ఇషాన్‌ కిషన్, శార్దుల్‌ ఠాకూర్, అశి్వన్‌ దీనికి హాజరయ్యారు.

అశ్విన్‌ తన ఆటకు మరింత పదును పెట్టుకుంటూ సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్‌ చేశాడు. వామప్‌ మ్యాచే అయినా ఇంగ్లండ్‌లాంటి భారీ హిట్టర్లు ఉన్న టీమ్‌పై అతను ఎలా ప్రభావం చూపిస్తాడనేది ఆసక్తికరం. తుది జట్టులో ఎనిమిదో స్థానం కోసం పిచ్‌ పరిస్థితులను బట్టి అశి్వన్, శార్దుల్‌ మధ్యే పోటీ ఉంది. ఈ నేపథ్యంలో శార్దుల్‌ కూడా తన బౌలింగ్‌లో సత్తా చాటాల్సి ఉంది.

ఆసీస్‌తో చివరి మ్యాచే ఆడిన రోహిత్, కోహ్లి... ఆ మ్యాచ్‌కు దూరమైన గిల్, పాండ్యా మరింత ప్రాక్టీస్‌ కోసం కచి్చతంగా ఈ మ్యాచ్‌ బరిలోకి దిగవచ్చు. నిబంధనల ప్రకారం 11 మంది బ్యాటింగ్, 11 మంది బౌలింగ్‌ చేయవచ్చు కాబట్టి అందరినీ పరీక్షించుకునేందుకు కూడా ఇది తగిన అవకాశం. మరోవైపు 38 గంటల పాటు ప్రయాణించిన తర్వాత గురువారం రాత్రి గువహటి చేరిన ఇంగ్లండ్‌ జట్టు సభ్యులు తీవ్ర అలసటతో ఉన్నారు. వారు కోలుకొని మ్యాచ్‌లో సత్తా చాటగలరా లేక ప్రధాన ఆటగాళ్లంతా మైదానంలోకి దిగకుండా తప్పుకుంటారా చూడాలి.

జేసన్‌ రాయ్‌లాంటి హిట్టర్‌ స్థానంలో చివరి నిమిషంలో చోటు దక్కించుకున్న హ్యారీ బ్రూక్‌కు వరల్డ్‌ కప్‌ పెద్ద పరీక్ష. వామప్‌లో అతను భారత స్పిన్నర్లను ఎలా ఎదుర్కోగలడనేది ఆసక్తికరం. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ తరపున ఒక్క సెంచరీ చేసిన మ్యాచ్‌ మినహా మిగతా అన్నింటిలో అతను విఫలమయ్యాడు. పదో నంబర్‌ వరకూ బ్యాటింగ్‌ చేయగల ఆటగాళ్లు ఉండటం ఆ జట్టు బలం.  ఇటీవల సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను ఇంగ్లండ్‌ 2–1తో గెలుచుకుంది.

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)