రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..
Breaking News
ఐర్లాండ్‌కు బిగ్ షాకిచ్చిన ఒమన్.. వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో బోణీ
Published on Tue, 06/20/2023 - 10:17
ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 క్వాలిఫయర్స్‌లో ఒమన్ బోణీ కొట్టింది. బులవాయో అథ్లెటిక్ క్లబ్ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఒమన్ అద్భుతమైన విజయం సాధించింది. 282 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి ఒమన్ ఛేదించింది. ఒమన్ విజయంలో ఓపెనర్ ప్రజాపతి(72) కెప్టెన్ జీషన్ మక్సూద్ కీలక(59) కీలక పాత్ర పోషించారు.
ఐర్లాండ్ బౌలర్లలో లిటిల్, అడైర్ తలా రెండు వికెట్లు సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసింది. ఐర్లాండ్ బ్యాటర్లలో డాక్రెల్(91), హ్యరీ టెక్టార్(52) పరుగులతో రాణించారు. ఒమన్ బౌలర్లలో బిలాల్ ఖాన్, ఫయ్యాజ్ భట్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. అయాన్ ఖాన్, ఒడేరా, మక్సూద్ ఒక్కొక్క వికెట్ పడగొట్టారు.
చదవండి: #CWCQualifiers2023: చెలరేగిన హసరంగా.. ICC CWC Qualifiersలో లంక శుభారంభం
Tags : 1