Breaking News

సత్తా చాటిన సికందర్‌ రజా, నికోలస్‌ పూరన్‌

Published on Wed, 06/28/2023 - 14:29

ICC Rankings: ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో జింబాబ్వే ఆల్‌రౌండర్‌ సికందర్‌ రజా, విండీస్‌ వైట్‌బాల్‌ స్పెషలిస్ట్‌ నికోలస్‌ పూరన్‌ సత్తా చాటారు. వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌-2023లో అద్భుతమైన ప్రదర్శనల కారణంగా వీరు ర్యాంకింగ్స్‌లో తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. పూరన్‌ 13 స్థానాలు జంప్‌ చేసి టాప్‌ 20లోకి (19వ స్పాట్‌) ప్రవేశిస్తే.. సికందర్‌ రజా 7 స్థానాలు మెరుగుపర్చుకుని  27వ ప్లేస్‌కు ఎగబాకాడు.

వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో బంతితోనూ సత్తా చాటిన సికందర్‌.. ఆల్‌రౌండర్ల విభాగంలోనూ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని మూడో ప్లేస్‌కు చేరాడు. బౌలింగ్‌లో 4 మ్యాచ్‌ల్లో 18 వికెట్లతో చెలరేగిన లంక స్పిన్నర్‌ వనిందు హసరంగ 2 స్థానాలు మెరుగుపర్చుకుని 24వ ప్లేస్‌కు చేరగా.. జింబాబ్వే పేసర్‌ రిచర్డ్‌ నగరవ 27 స్థానాలు మెరుగుపర్చుకుని 32వ స్థానానికి ఎగబాకాడు.

వీరితో పాటు క్వాలిఫయర్స్‌లో సత్తా చాటిన మరికొందరు బ్యాటర్లు కూడా ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకున్నారు. 3 ఫిఫ్టిలతో రాణించిన నెదర్లాండ్స్‌ కెప్టెన్‌ స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ 24 స్థానాలు మెరుగుపర్చుకుని 40వ ర్యాంక్‌కు, జింబాబ్వే సీన్‌ విలియమ్స్‌ 10 స్థానాలు మెరుగుపర్చుకుని 43వ ప్లేస్‌కు చేరుకున్నారు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగంలో టాప్‌-10 స్థానాల్లో మాత్రం ఎలాంటి మార్పులు లేవు. బ్యాటింగ్‌లో బాబర్‌ ఆజమ్‌, బౌలింగ్‌లో హాజిల్‌వుడ్‌ అగ్రస్థానాల్లో కొనసాగుతున్నారు. భారత్‌ నుంచి బ్యాటింగ్‌ విభాగంలో శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ టాప్‌ 10లో ఉండగా.. బౌలింగ్‌లో సిరాజ్‌ ఒక్కడే టాప్‌-10లో ఉన్నాడు. 

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)