NZ Vs SL: న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన శ్రీలంక..

Published on Sun, 09/29/2024 - 13:34

గాలే వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్ 154 ప‌రుగుల తేడాతో శ్రీలంక ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో లంక క్లీన్ స్వీప్ చేసింది. 514 ప‌రుగుల భారీ వెన‌కంజ‌తో ఫాలోఆన్ ఆడిన కివీస్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 360 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

సెకెండ్ ఇన్నింగ్స్‌లో శ్రీలంక అరంగేట్ర‌ పేస‌ర్ నిషాన్ పీరిస్ అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. పీరిస్ 6 వికెట్లతో స‌త్తాచాటాడు. కివీస్ బ్యాట‌ర్ల‌లో కాన్వే(61), టామ్ బ్లండెల్‌(60), గ్లెన్ ఫిలిప్స్‌(78), మిచెల్ శాంట్న‌ర్‌(67) హాఫ్ సెంచ‌రీలు చేశారు.

88 ప‌రుగులకే కివీస్ ఆలౌట్‌..
ఇక రెండో ఇన్నింగ్స్‌లో కాస్త పోరాట ప‌టిమ చూపిన న్యూజిలాండ్‌.. తొలి ఇన్నింగ్స్‌లో మాత్రం దారుణమైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచింది. కేవ‌లం 88 ప‌రుగుల‌కే ఆలౌటై ఘోర ఆ ప్ర‌తిష్ట‌త‌ను మూట‌క‌ట్టుకుంది. లంక బౌల‌ర్లు దాటికి కివీస్ బ్యాట‌ర్లు విల్ల‌విల్లాడారు. 

కివీస్ బ్యాట‌ర్ల‌లో మిచెల్ శాంట్న‌ర్‌ (51 బంతుల్లో 29; 4 ఫోర్లు, ఒక సిక్సర్‌) టాప్‌ స్కోరర్‌ కాగా... రచిన్‌ రవీంద్ర (10), డారిల్‌ మిషెల్‌ (13) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. టామ్‌ లాథమ్‌ (2), డ్వేన్‌ కాన్వే (9), కేన్‌ విలియమ్సన్‌ (7), ఎజాజ్‌ పటేల్‌ (8), టామ్‌ బ్లండెల్‌ (1), గ్లెన్‌ ఫిలిప్స్‌ (0) విఫలమయ్యారు. లంక బౌలర్లలో ప్రభాత్‌ జయసూర్య 6, నిషాన్‌ మూడు వికెట్లు పడగొట్టారు.

లంక భారీ స్కోర్‌..
ఇక తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 5 వికెట్ల న‌ష్టానికి 602 ప‌రుగుల‌ భారీ స్కోర్ సాధించింది. క‌మిందు మెండిస్‌(182), చండీమాల్‌(116), కుశాల్ మెండిస్‌(106) అద్భుత‌మైన సెంచ‌రీలతో మెరిశారు. అనంత‌రం బ్లాక్‌క్యాప్స్ తమ మొద‌టి ఇన్నింగ్స్‌లో 88 ప‌రుగుల‌కే ఆలౌట్ కావ‌డంతో.. శ్రీలంక‌కు తొలి ఇన్నింగ్స్‌లో 514 పరుగుల భారీ ఆధిక్యం ల‌భించింది. ఆ తర్వాత ఫాలోఆన్ ఆడిన కివీస్‌.. ఇన్నింగ్స్ 154 ప‌రుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
చదవండి: IND vs BAN: టీమిండియా ఓపెనర్‌గా సంజూ శాంసన్‌..?
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)