డబ్ల్యూటీసీ ఫైనల్‌ అన్నారు.. ఇప్పుడేమో ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేని పరిస్థితి..!

Published on Sun, 03/19/2023 - 16:18

NZ VS SL 2nd Test: వెల్లింగ్టన్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో పర్యాటక శ్రీలంక జట్టు ఓటమి దిశగా పయనిస్తుంది. తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే కుప్పకూలి ఫాలో ఆన్‌ ఆడుతున్న లం‍కేయులు మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేశారు. శ్రీలంక.. న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు (580/4) ఇంకా 303 పరుగులు వెనుకపడి ఉంది.

ఓవర్‌నైట్‌ స్కోర్‌ 26/2 వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన శ్రీలంక.. మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ (3/50), మ్యాట్‌ హెన్రీ (3/44), సౌథీ (1/22), డౌగ్‌ బ్రేస్‌వెల్‌ (1/19), టిక్నర్‌ (1/21) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకే చాపచుట్టేసింది.  శ్రీలంక ఇన్నింగ్స్‌లో కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నే (89) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

న్యూజిలాండ్‌ పిలుపు మేరకు ఫాలో ఆన్‌ ఆడుతున్న శ్రీలంక.. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ పరాభవాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లోనూ కరుణరత్నే (51) హాఫ్‌ సెంచరీతో రాణించగా.. కుశాల్‌ మెండిస్‌ పోరాడుతున్నాడు. సౌథీ, డౌగ్‌ బ్రేస్‌వెల్‌లకు తలో వికెట్‌ దక్కింది. అంతకుముందు న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 580 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. కేన్‌ విలియమ్సన్‌ (215), హెన్రీ నికోల్స్‌(200 నాటౌట్‌) డబుల్‌ సెంచరీలతో చెలరేగగా.. కాన్వే 78 పరుగులు చేశాడు. 

కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్‌ చేసి, భారత్‌ను వెనక్కునెట్టి వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరాలని కలలు కన్న శ్రీలంక ప్రసుత్తం ఒక్క మ్యాచ్‌ కూడా గెలవలేని స్థితిలో ఉంది. తొలి టెస్ట్‌లో సూపర్‌ సెంచరీతో శ్రీలంక విజయావకాశాలను దెబ్బకొట్టిన విలియమ్సన్‌ ఈ మ్యాచ్‌లోనూ ఆ జట్టును గెలవకుండా చేశాడు. ​

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)