Breaking News

WC 2023: వచ్చీ రాగానే.. చరిత్ర సృష్టించిన కేన్‌ విలియమ్సన్‌..

Published on Sat, 11/04/2023 - 12:01

ICC WC 2023- Pak vs NZ: న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ జట్టులోకి తిరిగి వచ్చీ రాగానే అరుదైన రికార్డుతో మెరిశాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా ప్రపంచకప్‌ టోర్నీలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌- పాకిస్తాన్‌ పోటీకి దిగాయి.

సెమీస్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే రెండు జట్లకూ శనివారం నాటి మ్యాచ్‌ కీలకంగా మారింది. ఈ క్రమంలో చిన్నస్వామి స్టేడియంలో పైచేయి సాధించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్‌తో న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ రీఎంట్రీ ఇచ్చాడు.

ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే(35) అవుట్‌ కావడంతో పదకొండవ ఓవర్లో క్రీజులోకి వచ్చాడు. ఈ క్రమంలో పద్నాలుగో ఓవర్‌ మొదటి బంతికి.. హ్యారిస్‌ రవూఫ్‌ బౌలింగ్‌లో ఫోర్‌ బాదిన విలియమ్సన్‌.. మరుసటి బాల్‌కు సింగిల్‌ తీశాడు. తద్వారా ప్రపంచకప్‌ చరిత్రలో 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు.

కివీస్‌ తరఫున సరికొత్త చరిత్ర.. తొలి బ్యాటర్‌గా
న్యూజిలాండ్‌ తరఫున అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. వరల్డ్‌కప్‌లో 24 ఇన్నింగ్స్‌లోనే కేన్‌ విలియమ్సన్‌ ఈ ఫీట్‌ నమోదు చేశాడు. ఇక ఓవరాల్‌గా ఈ జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు.

కాగా బొటనవేలి గాయం కారణంగా కేన్‌ ఇన్నాళ్లూ జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో కివీస్‌ 16 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్‌ నష్టానికి 103 పరుగులు సాధించింది.

వరల్డ్‌కప్‌ టోర్నీలో తక్కువ ఇన్నింగ్స్‌లోనే 1000 పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్లు
19 - డేవిడ్ వార్నర్/ రోహిత్ శర్మ
20 - సచిన్ టెండూల్కర్/ ఏబీ డివిలియర్స్
21 - వివ్ రిచర్డ్స్/ సౌరవ్ గంగూలీ
22 - మార్క్ వా / హెర్షల్ గిబ్స్
23 - తిలకరత్నే దిల్షాన్
24 - కేన్ విలియమ్సన్*.

చదవండి: అయ్యర్‌ భారీ సిక్సర్‌! ఆమె రావడం మంచిదైంది.. కానీ! ప్రతిభను గుర్తించరా?

Videos

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)