Breaking News

చరిత్ర సృష్టించిన కివీస్‌ పేసర్‌: ప్రపంచంలోనే ఏకైక బౌలర్‌గా రికార్డు

Published on Fri, 01/12/2024 - 16:09

New Zealand vs Pakistan, 1st T20I: న్యూజిలాండ్‌ వెటరన్‌ పేసర్‌ టిమ్‌ సౌతీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. తద్వారా క్రికెట్‌ ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. పాకిస్తాన్‌తో తొలి టీ20 సందర్భంగా సౌతీ ఈ అరుదైన ఫీట్‌ నమోదు చేశాడు.

కాగా ఐదు టీ20లు ఆడేందుకు పాకిస్తాన్‌ జట్టు న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఇరుజట్ల మధ్య అక్లాండ్‌ వేదికగా తొలి మ్యాచ్‌ జరిగింది. టాస్‌ గెలిచిన షాహిన్‌ ఆఫ్రిది బృందం న్యూజిలాండ్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

ఈ క్రమంలో డారిల్‌ మిచెల్‌(27 బంతుల్లో 61- నాటౌట్‌), కెప్టెన్‌ విలియమ్సన్‌ (57) అద్భుత అర్ధ శతకాలతో మెరవగా.. కివీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 226 పరుగులు సాధించింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ 18 ఓవర్లకే చేతులెత్తేసింది. 180 పరుగులకు ఆలౌట్‌ అయి 46 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఏకైక బౌలర్‌గా రికార్డు
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో టిమ్‌ సౌతీ.. మహ్మద్‌ రిజ్వాన్‌(25), ఇఫ్తికర్‌ అహ్మద్‌(24) రూపంలో రెండు బిగ్‌ వికెట్లు తీశాడు. అబ్బాస్‌ ఆఫ్రిదిని అవుట్‌ చేసిన క్రమంలో.. అంతర్జాతీయ టీ20లలో తన 150వ వికెట్‌ నమోదు చేశాడు సౌతీ. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక బౌలర్‌గా నిలిచాడు. ఇక అబ్బాస్‌ తర్వాత హ్యారిస్‌ రవూఫ్‌ను పెవిలియన్‌కు పంపిన సౌతీ తొలి టీ20లో న్యూజిలాండ్‌ విజయాన్ని ఖరారు చేశాడు.

నంబర్‌ 2 ఎవరంటే
ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ టీ20లలో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో 35 ఏళ్ల కివీస్‌ ఫాస్ట్‌బౌలర్‌ టిమ్‌ సౌతీ(151) అగ్రస్థానంలో ఉండగా.. 140 వికెట్లతో బంగ్లాదేశ్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఈ అరుదైన లిస్టులో న్యూజిలాండ్‌ నుంచి ఇష్‌ సోధి(127), మిచెల్‌ సాంట్నర్‌(105) కూడా చోటు దక్కించుకోవడం విశేషం.

చదవండి: Ind vs Afg: అందుకే 19వ ఓవర్లో బంతి అతడి చేతికి: రోహిత్‌ శర్మ

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)