Breaking News

ఇంగ్లండ్‌ను చిత్తు.. 423 పరుగుల తేడాతో కివీస్‌ భారీ విజయం

Published on Tue, 12/17/2024 - 09:12

హామిల్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో 423 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ ఘన విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌ వైట్‌ వాష్‌ నుంచి కివీస్‌ తప్పించుకుంది. తొలి రెండు టెస్టుల్లో విజయం సాధించిన ఇంగ్లండ్‌ 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది.

కాగా 658 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 234 పరుగులకే కుప్పకూలింది. కివీస్‌ బౌలర్లలో స్పిన్నర్‌ మిచెల్‌ శాంట్నర్‌ 4 వికెట్లు పడగొట్టగా.. మాట్‌ హెన్రీ, టిమ్‌ సౌథీ తలా రెండు వికెట్లు సాధించారు. ఇంగ్లండ్‌ బ్యాటర్లలో జాకబ్‌ బెతల్‌(76) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. జో రూట్‌(54), అట్కినిసన్‌(43) పర్వాలేదన్పించారు.

కేన్ మామ భారీ సెంచరీ.. 
అంతకముందు రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ జట్టు 453 పరుగుల భారీ స్కోర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన అధిక్యాన్ని జోడించి 657 పరుగుల భారీ లక్ష్యాన్ని పర్యాటక జట్టు ముందు కివీస్ ఉంచింది. కివీ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (204 బంతుల్లో 156; 20 ఫోర్లు, 1 సిక్స్‌)  అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు.

విలియమ్సన్‌తో పాటు  రచిన్‌ రవీంద్ర (90 బంతుల్లో 44; 4 ఫోర్లు, 1 సిక్స్‌),డరైల్‌ మిచెల్‌ (84 బంతుల్లో 60; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), టామ్‌ బ్లండెల్‌ (55 బంతుల్లో 44; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), సాంట్నెర్‌ (38 బంతుల్లో 49; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) రాణించారు. 

ఇంగ్లండ్‌ బౌలర్లలో బెథెల్‌ 3 వికెట్లు తీయగా... బెన్‌ స్టోక్స్, షోయబ్‌ బషీర్‌ 2 వికెట్ల చొప్పున పడగొట్టారు. పాట్స్, అట్కిన్‌సన్, రూట్‌లకు ఒక్కో వికెట్‌ దక్కింది.  ​కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 347 పరుగులు చేయగా.. ఇంగ్లండ్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 143 పరుగుకే కుప్పకూలింది. కాగా ఈ మ్యాచ్‌ అనంతరం న్యూజిలాండ్‌ స్టార్‌ ప్లేయర్‌ టిమ్‌ సౌథీ టెస్టు క్రికెట్‌కు విడ్కోలు పలికాడు.
 

Videos

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)