Breaking News

NZ Vs Ban: ఆకస్మిక వర్షంలో తడిసిముద్దైన ఆటగాళ్లు.. మ్యాచ్‌ రద్దు

Published on Fri, 12/29/2023 - 15:24

New Zealand vs Bangladesh, 2nd T20I: న్యూజిలాండ్‌- బంగ్లాదేశ్‌ మ్యాచ్‌కు వరణుడు అడ్డుతగిలాడు. మౌంట్‌ మౌంగనీయ్‌లో ఇరు జట్ల మధ్య శుక్రవారం జరగాల్సిన రెండో టీ20 వర్షం కారణంగా రద్దైపోయింది. ఈ క్రమంలో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బంగ్లా 1-0తో ఆధిక్యం నిలబెట్టుకోగలిగింది.

కాగా నజ్ముల్‌ హొసేన్‌ షాంటో కెప్టెన్సీలో బంగ్లాదేశ్‌ జట్టు కివీస్‌ పర్యటనకు వెళ్లింది. ఈ యువ బ్యాటర్‌ సారథ్యంలో మూడు వన్డేల సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌లో అనూహ్య విజయం సాధించింది. తద్వారా క్లీన్‌స్వీప్‌ గండాన్ని తప్పించుకోవడమే గాకుండా.. న్యూజిలాండ్‌ గడ్డ మీద తొలి వన్డే గెలుపు నమోదు చేసి చరిత్ర సృష్టించింది.

తొలి టీ20 గెలుపు
ఇక మూడో వన్డేలో ఆతిథ్య కివీస్‌ను ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసిన బంగ్లాదేశ్‌.. ఊహించని రీతిలో టీ20 సిరీస్‌ను విజయంతో ఆరంభించింది. నేపియర్‌ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో శాంట్నర్‌ బృందంపై ఐదు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఇక కివీస్‌ గడ్డ మీద బంగ్లాదేశ్‌కు ఇదే తొలి టీ20 గెలుపు కూడా కావడం విశేషం.

ఆకస్మిక వర్షం.. తడిసిపోయిన ఆటగాళ్లు
ఈ క్రమంలో రెండో టీ20లోనూ సత్తా చాటాలని భావించిన నజ్ముల్‌ షాంటో బృందం.. అందుకు తగ్గట్లుగానే టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. పేసర్‌ షోరిఫుల్‌ ఇస్లాం.. కివీస్‌ ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌(2)ను పెవిలియన్‌కు పంపి శుభారంభం అందించాడు.

అయితే, 23 బంతుల్లోనే 43 పరుగులు రాబట్టి ప్రమాదకరంగా మారుతున్న  మరో ఓపెనర్‌ టిమ్‌ సిఫార్ట్‌ను తంజీం హసన్‌ సకీబ్‌ అవుట్‌ చేశాడు. వీరి స్థానాల్లో క్రీజులోకి వచ్చిన డారిల్‌ మిచెల్‌ 18(24 బంతుల్లో), గ్లెన్‌ ఫిలిప్స్‌ 9(14 బంతుల్లో) పరుగులతో నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు.

మ్యాచ్‌ రద్దు
అయితే, 11 ఓవర్ల ఆట ముగిసే సరికి ఆకస్మికంగా వర్షం మొదలైంది. అప్పటికి న్యూజిలాండ్‌ స్కోరు: 72/2. ఇక మధ్యాహ్నం రెండున్నర గంటలు దాటినా తెరిపినివ్వలేదు. ఆ తర్వాత వర్షం మరింత ఎక్కువ కావడంతో న్యూజిలాండ్‌- బంగ్లాదేశ్‌ మధ్య రెండో టీ20ని రద్దు చేస్తున్నట్లు అంపైర్లు అధికారికంగా ప్రకటించారు.

ఇక ఇరు జట్ల మధ్య డిసెంబరు 31 (ఆదివారం) నిర్ణయాత్మక మూడో టీ20 జరుగనుంది. ఇందులో గనుక బంగ్లాదేశ్‌ గెలిస్తే కివీస్‌ గడ్డపై మరో సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయం!!

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)