NZ vs Aus: ఆసీస్‌ కెప్టెన్‌ కమిన్స్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Published on Wed, 02/28/2024 - 13:18

"I’d doubt that I’ll be captaining..’’...: న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు ఆస్ట్రేలియా తమ తుదిజట్టును ప్రకటించింది. కివీస్‌తో సిరీస్‌లో స్టీవ్‌ స్మిత్‌ ఓపెనర్‌గా కొనసాగుతాడని స్పష్టం చేసింది. ఉస్మాన్‌ ఖవాజాతో కలిసి అతడు ఆసీస్‌ ఇన్నింగ్స్‌ ఆరంభిస్తాడని తెలిపింది.

ఆల్‌రౌండర్లు కామెరాన్‌ గ్రీన్‌, మిచెల్‌ మార్ష్‌ ఇద్దరిని తుదిజట్టులో ఆడిస్తున్నట్లు వెల్లడించింది. ఇక తుదిజట్టును ప్రకటిస్తున్న సందర్భంగా ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాను కెప్టెన్‌గా ఎన్నాళ్లు కొనసాగుతానో తెలియదన్నాడు.

వాళ్ల కెప్టెన్సీలో ఆడటం ఆస్వాదిస్తున్నా
ముప్పై ఏళ్ల వయసు దాటిన తర్వాత ఫామ్‌, ఆటకు శరీరం సహకరించే తీరుపైనే తన భవిష్యత్తు ఆధారపడి ఉందని కమిన్స్‌ పేర్కొన్నాడు. టీ20 ఫార్మాట్లో మాథ్యూ వేడ్‌, మిచెల్‌ మార్ష్‌ సారథ్యంలో ఆడటాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నానని.. వాళ్లిద్దరి కారణంగా తనకు కాస్త విశ్రాంతి లభించిందని హర్షం వ్యక్తం చేశాడు.

మొదటి రెండు టెస్టుల మధ్య ఆరేళ్ల గ్యాప్‌
కాగా ఫాస్ట్‌ బౌలర్‌ అయిన ప్యాట్‌ కమిన్స్‌ 2011లో టెస్టుల్లో​ అరంగేట్రం చేసినా.. ఆ తర్వాత 2017 వరకు ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. వరుసగా గాయాల బారిన పడిన కారణంగా మొదటి రెండు టెస్టుల మధ్య దాదాపు ఆరేళ్ల గ్యాప్‌ వచ్చింది. అయితే, ఆ తర్వాత కమిన్స్‌ వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. 

ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్‌గా వరుస విజయాలు అందిస్తూ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ టైటిల్‌ సాధించాడు. భారత్‌ వేదికగా వన్డే వరల్డ్‌కప్‌-2023లో కంగారూలను చాంపియన్లుగా నిలిపి సత్తా చాటాడు. ఇక ప్రస్తుతం టెస్టుల్లో ప్యాట్‌ కమిన్స్‌ నంబర్‌వన్‌ బౌలర్‌ కావడం విశేషం. 

న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు ఆస్ట్రేలియా ఎలెవన్:
స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, కామెరూన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హాజిల్‌వుడ్‌.

చదవండి: NZ Vs Aus: న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ.. స్టార్‌ బ్యాటర్‌ దూరం

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)