NZ VS AUS 1st T20: టిమ్‌ సౌథీ రికార్డు

Published on Wed, 02/21/2024 - 15:24

న్యూజిలాండ్‌ వెటరన్‌ బౌలర్‌ టిమ్‌ సౌథీ ఆ దేశం తరఫున అత్యధిక టీ20లు ఆడిన ఆటగాడిగా అవతరించాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ (ఫిబ్రవరి 21) జరిగిన మ్యాచ్‌లో ఆడటం ద్వారా సౌథీ ఈ ఘనతను సాధించాడు. 

సౌథీ ఈ రికార్డును సాధించే క్రమంలో మార్టిన్‌ గప్తిల్‌ను అధిగమించాడు. గప్తిల్‌ న్యూజిలాండ్‌ తరఫున 122 టీ20లు ఆడగా.. సౌథీ ఇవాల్టి మ్యాచ్‌తో కలుపుకుని 123 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. సౌథీ, గప్తిల్‌ తర్వాత న్యూజిలాండ్‌ తరఫున అత్యధిక టీ20లు ఆడిన రికార్డు ఐష్‌ సోధి పేరిట ఉంది. సోధి తన టీ20 కెరీర్‌లో 110 మ్యాచ్‌లు ఆడాడు. ఓవరాల్‌గా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ పేరిట ఉంది. హిట్‌మ్యాన్‌ టీమిండియా తరఫున ఇప్పటివరకు 151 మ్యాచ్‌లు ఆడాడు. 

మ్యాచ్‌ విషయాని​కొస్తే.. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరింతగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ చివరి బంతికి గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్‌ చేయగా.. టిమ్‌ డేవిడ్‌ (10 బంతుల్లో 31 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చివరి బంతికి బౌండరీ బాది ఆసీస్‌ను గెలిపించాడు. ఆసీస్‌ గెలుపులో మిచెల్‌ మార్ష్‌ (44 బంతుల్లో 72 నాటౌట్‌; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) కీలకపాత్ర పోషించాడు. ఈ గెలుపుతో ఆసీస్‌ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. 
 

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)