నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం
Breaking News
వింబుల్డన్‌లో ఓటమి.. రిటైర్మెంట్పై జకోవిచ్ కీలక వ్యాఖ్యలు
Published on Sat, 07/11/2026 - 09:34
సెర్బియా టెన్నిస్ సూపర్ స్టార్ నొవాక్ జకోవిచ్ రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలో జకోవిచ్ సెమీస్‌లో ఇంటిబాట పట్టిన సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో జకోవిచ్ 4-6, 4-6, 4-6 తేడాతో ప్రపంచ నంబర్‌వన్ జానిక్ సినర్ (ఇటలీ) చేతిలో వరుస సెట్లలో పరాజయం పాలయ్యాడు.
దీంతో జకోవిచ్ 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలన్న కల అలాగే మిగిలపోయింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత జకోవిచ్ వచ్చే ఏడాది వింబుల్డన్‌లో ఆడడంపై క్లారిటీ ఇచ్చాడు. తానిప్పుడే రిటైర్ కానని, వచ్చే ఏడాది వింబుల్డన్ ఆడాలనుకుంటున్నట్లు తన మనసులోని మాటను బయటపెట్టాడు. జకోవిచ్ 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించేంత వరకు టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించే ఉద్దేశం తనకు లేదని అభిమానులకు పరోక్షంగా హింట్ ఇచ్చినట్లయింది.
'మూడో రోజుల క్రితం వింబుల్డన్‌లో నేను సాధించిన విజయం మరువలేనిది. 40 ఏళ్ల వయసులో ఈ ప్రదర్శన నాకు మరింత బూస్ట్ ఇస్తోంది. వింబుల్డన్‌లో సెమీస్‌లో ఓటమి పాలవ్వడం బాధించినప్పటికీ ఇక్కడి దాకా చేరుకోవడం ఆనందంగా ఉంది. ఇవాళ మ్యాచ్ సినర్‌దే. వరుస సెట్లలో అతడి చేతిలో ఖంగుతినడంపై పునరాలోచన చేస్తున్నా.
తప్పిదాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని వాటిని సరిదిద్దుకొనే ప్రయత్నం చేస్తాను. వచ్చే ఏడాది వింబుల్డన్ ఆడాలనుకుంటున్నా.' అని చెప్పుకొచ్చాడు. ఇక 2022లో జకోవిచ్ చివరిసారి వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గాడు. ఇక 2023లో యూఎస్ ఓపెన్ గెలిచిన జకోవిచ్ అప్పటి నుంచి మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలవలేకపోయాడు.
A legend departs Centre Court.
It's always a pleasure, @djokernole.#Wimbledon pic.twitter.com/GVYMZ0uoTE— Wimbledon (@Wimbledon) July 10, 2026
Flawless from Jannik Sinner. What a performance. pic.twitter.com/0LijKmAjUd
— Wimbledon (@Wimbledon) July 10, 2026
Read: మొన్న పోర్చుగల్, ఇవాళ బెల్జియం.. చావుదెబ్బ కొట్టాడు
Tags : 1