Breaking News

సచిన్‌ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టేది అతడే: రిక్కీ పాంటింగ్‌

Published on Fri, 08/16/2024 - 14:17

అంతర్జాతీయ క్రికెట్‌లో వంద శతకాలు సాధించిన ఏకైక బ్యాటర్‌ సచిన్‌ టెండుల్కర్‌. టెస్టుల్లో 15,921... వన్డేల్లో 18,426 పరుగులతో ఓవరాల్‌గా రెండు ఫార్మాట్లలోనూ ఈ టీమిండియా దిగ్గజం టాప్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఇక సచిన్‌ సాధించిన సెంచరీల రికార్డుకు చేరువగా ఉన్న ఏకైక క్రికెటర్‌ టీమిండియా రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లి.

ఇప్పటికే 80 శతకాలు బాదిన 35 ఏళ్ల ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. మరో 20 మార్లు వంద పరుగుల మార్కును అందుకుంటే సచిన్‌ టెండుల్కర్‌ రికార్డును సమం చేస్తాడు. అయితే, వన్డేల్లో ఇప్పటి వరకు 13,906 పరుగులు సాధించి.. టాప్‌ స్కోరర్ల జాబితాలో ఉన్న కోహ్లి టెస్టు ఖాతాలో 8848 పరుగులు మాత్రమే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో వన్డే కింగ్‌ అయిన కోహ్లి టెస్టుల్లో మాత్రం సచిన్‌ను అందుకోవడం కష్టమే అంటున్నాడు ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్‌. టెస్టుల్లో సచిన్‌ టెండుల్కర్‌ అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టగల సత్తా ఇంగ్లండ్‌ వెటరన్‌ బ్యాటర్‌ జో రూట్‌కు ఉందని పేర్కొన్నాడు. కాగా ఇంగ్లిష్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన రూట్‌ ప్రస్తుతం బెన్‌స్టోక్స్‌ సారథ్యంలో ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

అప్పట్లో ఫామ్‌లేమితో సతమతమైన 33 ఏళ్ల ఈ రైట్‌హ్యాండర్‌.. కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. ఇటీవల వెస్టిండీస్‌తో మ్యాచ్‌ సందర్భంగా టెస్టుల్లో 32వ సెంచరీ సాధించిన రూట్‌.. 12 వేల పరుగుల మైలురాయిని దాటాడు. ఈ నేపథ్యంలో రిక్కీ పాంటింగ్‌ మాట్లాడుతూ.. ‘‘ఇంకో నాలుగేళ్ల పాటు రూట్‌ టెస్టుల్లో కొనసాగితే కచ్చితంగా ఇది సాధ్యమవుతుంది.

అయివతే, ఇంగ్లండ్‌ ఏడాదికి ఎన్ని టెస్టు మ్యాచ్‌లు ఆడుతుందన్న అంశం మీదే అతడి గణాంకాలు ఆధారపడి ఉంటాయి. ఏడాదికి కనీసం 14 మ్యాచ్‌లు ఆడటం సహా అందులో సంవత్సరానికి రూట్‌ 800 నుంచి వెయ్యి పరుగుల చొప్పున సాధిస్తే అతడు సచిన్‌ రికార్డు బ్రేక్‌ చేయడం సాధ్యమే.

అయితే, 37 ఏళ్ల వయసులోనూ అతడు పరుగుల దాహంతో ఉంటేనే.. అది కూడా రోజురోజుకు తన ఆటను మరింత మెరుగుపరచుకుని.. నిలకడగా రాణిస్తేనే రూట్‌కు ఈ అవకాశం ఉంటుంది. నాలుగేళ్ల క్రితం కనీసం యాభై పరుగుల మార్కు అందుకోవడానికి కష్టాలు పడ్డ రూట్‌.. ఇప్పుడు తన శైలిని మార్చేశాడు. అందుకే మరో నాలుగేళ్లపాటు అతడు ఇలాగే కొనసాగితే.. కచ్చితంగా టెస్టుల్లో అత్యధిక పరుగుల వీరుడిగా అవతరిస్తాడు’’ అని రిక్కీ పాంటింగ్‌ అంచనా వేశాడు. ఇంగ్లండ్‌ మాజీ సారథి మైకేల్‌ వాన్‌ సైతం గతంలో ఇదే అభిప్రాయం  వ్యక్తం చేశాడు.

కాగా టెస్టుల్లో ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ పాంటింగ్‌ టెస్టుల్లో 13,378 పరుగులు సాధించి.. సచిన్‌ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక ఈ జాబితాలో సౌతాఫ్రికా లెజెండ్‌ జాక్వెస్‌ కలిస్‌(13,289), టీమిండియా దిగ్గజం రాహుల్‌ ద్రవిడ్‌(13,288), ఇంగ్లండ్‌ మాజీ సారథి అలిస్టర్‌ కుక్‌(12,472), శ్రీలంక లెజెండరీ వికెట్‌ కీపర్‌ కుమార్‌ సంగక్కర(12, 400) తర్వాత ఏడో స్థానంలో రూట్‌(12,027) ఉన్నాడు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)