Breaking News

IPL 2025: కేఎల్‌ రాహుల్‌ కాదు.. ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ అతడే..!

Published on Fri, 01/17/2025 - 12:45

భారత మాజీ వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తీక్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2025 ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా అక్షర్‌ పటేల్‌ వ్యవహరిస్తాడని జోస్యం చెప్పాడు. మెగా వేలంలో డీసీ యాజమాన్యం కేఎల్‌ రాహుల్‌ను రూ. 14 కోట్లకు సొంతం చేసుకున్నా, అక్షర్‌ పటేల్‌కే ఢిల్లీ కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని అన్నాడు. క్రిక్‌బజ్‌లో జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా డీకే ఈ విషయాలను పంచుకున్నాడు.

ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా వైస్‌ కెప్టెన్‌గా అక్షర్‌ పటేల్‌ ఎంపికయ్యాడు. హార్దిక్‌ పాండ్యాను కాదని అక్షర్‌ను టీమిండియా వైస్‌ కెప్టెన్‌గా నియమించడంపై డీకే స్పందిస్తూ.. హార్దిక్‌ను వైస్ కెప్టెన్సీ నుండి ఎందుకు తొలగించారో నాకు తెలియదు. హార్దిక్‌ను వైస్‌ కెప్టెన్సీ నుంచి తప్పించడానికి కారణం కూడా కనిపించడం లేదు. హార్దిక్‌ వైస్‌ కెప్టెన్‌గా ఉండగా టీమిండియా బాగా రాణించింది. 

హార్దిక్‌, సూర్యకుమార్‌ ఆథ్వర్యంలో టీమిండియా ద్వైపాక్షిక సిరీస్‌లో (సౌతాఫ్రికా) గెలిచింది. అక్షర్ పటేల్‌ విషయానికొస్తే.. అతనికి ఇదో మంచి అవకాశం. మరి ముఖ్యంగా అతను ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా కూడా ఉండబోతున్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌ అక్షర్‌కు బాగా ఉపయోగపడుతుంది. గుజరాత్‌ కెప్టెన్‌గా కూడా అక్షర్‌కు అనుభవం ఉంది. అక్షర్‌కు నా శుభాకాంక్షలు అంటూ కార్తీక్ చెప్పుకొచ్చాడు.

డీకే ఏ ఆధారంగా అక్షర్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ అన్నాడో తెలీదు కానీ, అక్షర్‌కు ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ బాగా ఉపయోగపడుతుంది. అక్షర్‌ గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. రిషబ్‌ పంత్‌ గైర్హాజరీలో అక్షర్‌ ఓ మ్యాచ్‌లో డీసీ కెప్టెన్‌గా సేవలందించాడు. 

మెగా వేలానికి ముందు డీసీ యాజమాన్యం అక్షర్‌ను రూ.18 కోట్లకు రీటైన్‌ చేసుకుంది. 30 ఏళ్ల స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన అక్షర్‌.. 2019 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌లో భాగమై ఉన్నాడు. కాగా, అక్షర్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ అవుతాడని తేల్చి చెప్పిన దినేశ్‌ కార్తీక్‌ గతంలో ఆ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా వ్యవహరించాడు.

సాధారణ ఆటగాడిగా రాహుల్‌..?
అక్షర్‌ పటేల్‌ ఢిల్లీ కెప్టెన్‌గా ఎంపికైతే పంజాబ్‌ కింగ్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మాజీ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ 2020 సీజన్‌ తర్వాత తొలిసారి సాధారణ ఆటగాడిగా బరిలోకి దిగుతాడు. 2020, 2021 సీజన్లలో పంజాబ్‌ కెప్టెన్‌గా.. 2022-24 వరకు లక్నో కెప్టెన్‌గా వ్యవహరించిన రాహుల్‌ను ఇటీవల ముగిసిన మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ దక్కించుకుంది. రాహుల్‌ డీసీ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడో లేక మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేస్తాడో అన్న అంశం ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటే, గత సీజన్‌లో ఢిల్లీ కెప్టెన్‌గా వ్యవహరించిన రిషబ్‌ పంత్‌ను మెగా వేలంలో లక్నో సూపర్‌ జెయింట్స్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)