Breaking News

సచిన్‌ సహచరుడు, టీమిండియా మాజీ క్రికెటర్‌పై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌

Published on Thu, 02/01/2024 - 20:47

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ఒకనాటి సహచరుడు, టీమిండియా మాజీ ఆటగాడు ప్రశాంత్‌ వైద్యపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యింది. చెక్‌ బౌన్స్‌ కేసులో నాగ్‌పూర్‌ పోలీసులు (బజాజ్‌ నగర్‌) వైద్యను అరెస్ట్‌ చేశారు. అనంతరం పోలీసులు వైద్యను ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచగా.. పూచికత్తుపై అతన్ని విడుదల చేశారు. నాగ్‌పూర్‌కు చెందిన ఓ వ్యాపారిని చీట్‌ చేసిన కేసులో పోలీసులు ఈ మాజీ క్రికెటర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే..  నాగ్‌పూర్‌కు చెందిన వ్యాపారి నుంచి వైద్య 1.9 కోట్లు విలువ చేసే స్టీల్‌ కొనుగోలు చేసి, అందుకు బదులుగా చెక్‌లకు ఇచ్చాడు. అయితే చెక్‌లు బౌన్స్‌ కావడంతో సదరు వ్యాపారి వైద్యను పలు మార్లు నగదు చెల్లించాల్సిందిగా కోరాడు. డబ్బు చెల్లించాలని వైద్యను ఎన్ని సార్లు విన్నవించుకున్నా స్పందన లేకపోవడంతో ఆ వ్యాపారి కోర్టును ఆశ్రయించాడు. కోర్టు పలు నోటీసులు ఇచ్చిన అనంతరం వైద్యపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన బజాజ్‌ నగర్‌ పోలీసులు వైద్యను అరెస్ట్‌ చేసి కోర్టులో సబ్మిట్‌ చేశారు. 

56 ఏళ్ల ప్రశాంత్‌ వైద్య 1995-96 మధ్యలో సచిన్‌ టెండూల్కర్‌, వినోద్‌ కాంబ్లీలతో కలిసి 4 వన్డే మ్యాచ్‌ల్లో (4 వికెట్లు) టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు. అప్పట్లో వైద్య భారత జట్టులో ఉత్తమ ఫాస్ట్‌ బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. వైద్య మహారాష్ట్రకు చెందినప్పటికీ బెంగాల్‌ తరఫున దేశవాలీ క్రికెట్‌ ఆడాడు. వైద్య తన ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో 56 మ్యాచ్‌లు ఆడి 171 వికెట్లు పడగొట్టాడు. వైద్య ప్రస్తుతం విదర్భ క్రికెట్ అసోసియేషన్ డెవలప్‌మెంట్ కమిటీకి నేతృత్వం వహిస్తున్నాడు.  
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)