Breaking News

బోల్ట్‌ సరసన లైల్స్‌

Published on Sat, 09/20/2025 - 03:55

టోక్యో: జమైకా దిగ్గజ అథ్లెట్‌ ఉసేన్‌ బోల్ట్‌కు మాత్రమే సాధ్యమైన ఘనతను అమెరికా స్టార్‌ అథ్లెట్‌ నోవా లైల్స్‌ సాధించాడు. ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో వరుసగా నాలుగోసారి పురుషుల 200 మీటర్ల విభాగంలో లైల్స్‌ విజేతగా నిలిచాడు. 42 ఏళ్ల ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌ షిప్‌ చరిత్రలో ఉసేన్‌ బోల్ట్‌ (2009, 2011, 2013, 2015లలో) తర్వాత 200 మీటర్ల విభాగంలో వరుసగా నాలుగు స్వర్ణ పతకాలు నెగ్గిన రెండో అథ్లెట్‌గా లైల్స్‌ గుర్తింపు పొందాడు. 

శుక్రవారం జరిగిన 200 మీటర్ల ఫైనల్‌ రేసును లైల్స్‌ 19.52 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించి పసిడి పతకం గెలిచాడు. 2019, 2022, 2023 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలోనూ ఈ విభాగంలో లైల్స్‌ 
విజేతగా నిలిచాడు.  

మెలిస్సా ‘స్ప్రింట్‌ డబుల్‌’ 
మరోవైపు మహిళల 200 మీటర్ల విభాగంలో అమెరికాకే చెందిన మెలిస్సా జెఫర్సన్‌ వుడెన్‌ స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. 200 మీటర్ల ఫైనల్‌ రేసును మెలిస్సా 21.68 సెకన్లలో పూర్తి చేసి విజేతగా అవతరించింది. 100 మీటర్ల విభాగంలోనూ మెలిస్సాకే బంగారు పతకం లభించింది. 2013లో షెల్లీ ఆన్‌ ఫ్రేజర్‌ ప్రైస్‌ తర్వాత ఒకే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 100, 200 మీటర్ల విభాగాల్లో పసిడి పతకాలు నెగ్గిన రెండో అథ్లెట్‌గా మెలిస్సా గుర్తింపు పొందింది.  

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)