Breaking News

వరల్డ్‌కప్‌ జట్టులో నో ఛాన్స్‌.. యుజ్వేంద్ర చాహల్‌ కీలక నిర్ణయం!

Published on Wed, 09/06/2023 - 20:25

వన్డే ప్రపంచకప్‌-2023కు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టులో లెగ్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌కు చోటు దక్కపోయిన సంగతి తెలిసిందే. చాహల్‌కు ఆసియాకప్‌ జట్టులో చోటు దక్కపోయినప్పటికీ.. వరల్డ్‌కప్‌కు మాత్రం ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ మరోసారి సెలక్టర్లు మొండి చేయి చూపించారు.

ఈ క్రమంలో చాహల్‌ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంగ్లండ్‌ కౌంటీల్లో ఆడాలని చాహల్‌ నిర్ణయించకున్నట్లు తెలుస్తోంది. కౌంటీ ఛాంపియన్‌షిప్-2023లో ఆఖరి మూడు మ్యాచ్‌ల్లో కెంట్ క్రికెట్‌ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహించనున్నట్లు సమాచారం.

చాహల్‌ ఇంగ్లండ్‌ కౌంటీల్లో కెంట్‌ తరపున ఆడనున్నాడు. ఇందుకు సంబంధించి కెంట్ కౌంటీ క్రికెట్ క్లబ్ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది. కౌంటీ క్రికెట్ ఆడేందుకు బీసీసీఐ అతనికి ఎన్‌ఓసీ కూడా మంజూరు చేసింది.

అతడు భారత జట్టుకు అవసరమైతే వెంటనే జాతీయ జట్టుతో చేరుతాడని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు టైమ్స్‌ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఇక​ ఇప్పటికే ఇంగ్లండ్‌ కౌంటీల్లో అజింక్యా రహానే, ఛతేశ్వర్‌ పుజారా, ఉమేశ్‌యాదవ్‌ సహచర ఆటగాళ్లు ఇంగ్లండ్‌ కౌంటీల్లో ఆడతున్నారు.
చదవండి: ODI WC 2023: వరల్డ్‌కప్‌లో భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌.. టికెట్ ధ‌ర రూ.57ల‌క్ష‌లు!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)