Breaking News

అతడిని ఆపటం ఎవరితరం కాలేదు: భారత మాజీ క్రికెటర్‌

Published on Sat, 03/22/2025 - 14:02

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL)-2025లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ బరిలోకి దిగనుంది. తాజా సీజన్‌లో తొలి మ్యాచ్‌లో భాగంగా సొంతమైదానం ఈడెన్‌ గార్డెన్స్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో శనివారం తలపడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా.. కోల్‌కతా స్టార్‌ సునిల్‌ నరైన్‌ (Sunil Narine) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఐపీఎల్‌-2025 ఆరంభ మ్యాచ్‌లో అందరి కళ్లు నరైన్‌పైనే ఉన్నాయని.. ఈసారి కూడా గతేడాది మాదిరి అతడు రాణిస్తే కేకేఆర్‌కు తిరుగు ఉండదని పేర్కొన్నాడు. బ్యాట్‌తో, బంతితో రాణించగల ఈ వెస్టిండీస్‌ ఆటగాడు మరోసారి కోల్‌కతాకు కీలకం కాబోతున్నాడని ఆకాశ్‌ చోప్రా (Aakash Chopra) పేర్కొన్నాడు.

పవర్‌ ప్లేలో ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో
కాగా గతేడాది కేకేఆర్‌ చాంపియన్‌గా నిలవడంలో సునిల్‌ నరైన్‌ది కీలక పాత్ర. ఈ స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగి పరుగుల సునామీ సృష్టించాడు. పవర్‌ ప్లేలో ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో దంచికొట్టి కేకేఆర్‌ విజయాలకు బాట వేశాడు. 

గత సీజన్‌లో పద్నాలుగు ఇన్నింగ్స్‌లో మొత్తంగా 488 పరుగులు సాధించాడు ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌. 180.74 స్ట్రైక్‌రేటుతో పరుగులు రాబట్టి కేకేఆర్‌ తరఫున టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ఈ నేపథ్యంలో కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా మాట్లాడుతూ.. ‘‘ఓపెనర్‌ సునిల్‌ నరైన్‌. నాలుగు ఓవర్లపాటు పూర్తి స్థాయిలో బౌలింగ్‌ చేయగలడు కూడా! అయితే, ఈసారి బ్యాట్‌తో ఎలా విజృంభిస్తాడన్నది ఆసక్తికరం.

అతడిని ఆపటం ఎవరితరం కాలేదు
గతేడాది కేకేఆర్‌ విజయాలను నిర్దేశించింది అతడే! అతడి అద్భుత ప్రదర్శన కారణంగా కేకేఆర్‌ రాత మారిపోయింది. నరైన్‌ బ్యాట్‌ నుంచి సెంచరీ కూడా జాలువారింది. ముఖ్యంగా పవర్‌ప్లేలో నిలకడైన బ్యాటింగ్‌తో పరుగులు రాబట్టిన తీరు అద్బుతం.

టీ20 క్రికెట్‌కు ఏం కావాలో నరైన్‌ అది చేసి చూపించాడు. పరుగులు రాబట్టుకుంటూ పోయాడు. అతడిని ఆపటం ఎవరితరం కాలేదు. బౌలర్లు ఎన్ని వ్యూహాలు మార్చినా నరైన్‌ను కట్టడి చేయలేకపోయారు. సునిల్‌ నరైన్‌ ఈసారి కూడా అలాగే రాణిస్తే కేకేఆర్‌కు తిరుగు ఉండదు’’ అని పేర్కొన్నాడు.

 ఆర్సీబీ స్పిన్నర్లే కీలకం
ఇక తొలి మ్యాచ్‌లో కేకేఆర్‌- ఆర్సీబీ తలపడనున్న నేపథ్యంలో.. ‘‘ఆర్సీబీ స్పిన్నర్లు ఎలా బౌలింగ్‌ చేస్తారన్న అంశం మీదే మ్యాచ్‌ ఫలితం ఆధారపడి ఉంటుంది. కృనాల్‌ పాండ్యా, సూయశ్‌ శర్మలతో పాటు లియామ్‌ లివింగ్‌స్టోన్‌, జేకబ్‌ బెతెల్‌ ప్రదర్శనే ఆర్సీబీకి కీలకం కానుంది.

ఇక కేకేఆర్‌కు ఈసారి మిచెల్‌ స్టార్క్‌ లేడు. అతడి స్థానంలో స్పెన్సర్‌ జాన్సన్‌ లేదంటే అన్రిచ్‌ నోర్జే ఆడతారు. బ్యాటర్ల విషయానికొస్తే ఫిల్‌ సాల్ట్‌, శ్రేయస్‌ అయ్యర్‌లను కేకేఆర్‌ కోల్పోయింది. 

నరైన్‌.. క్వింటన్‌ డికాక్‌ లేదంటే రహ్మనుల్లా గుర్బాజ్‌తో కలిసి ఓపెనింగ్‌ చేసే అవకాశం ఉంది. టాపార్డర్‌ రాణిస్తేనే కోల్‌కతాకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి’’ అని ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డాడు.

చదవండి: నమ్మశక్యం కాని ఇన్నింగ్స్‌.. అతడి బ్యాటింగ్‌ అద్భుతం: కివీస్‌ కెప్టెన్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)