Breaking News

పాకిస్తాన్ జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. బాబ‌ర్ ఆజం, రిజ్వాన్‌ల‌పై వేటు

Published on Tue, 07/08/2025 - 21:35

బంగ్లాదేశ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం 15 మంది స‌భ్యుల‌తో కూడిన త‌మ జ‌ట్టును పాకిస్తాన్ క్రికెట్ మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. ఈ జ‌ట్టుకు సల్మాన్ అలీ అఘా నాయ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. అయితే స్టార్ ప్లేయ‌ర్లు బాబ‌ర్ ఆజం, షాహీన్ షా అఫ్రిది, మహ్మద్ రిజ్వాన్‌లపై సెల‌క్ట‌ర్లు వేటు వేశారు.

ఈ జ‌ట్టులో ఈ సీనియ‌ర్ త్ర‌యానికి చోటు ద‌క్క‌లేదు. పాక్ కొత్త వైట్‌బాల్ కోచ్ మైక్ హెస్సన్ సూచ‌న మేర‌కు వీరిని సెల‌క్ట‌ర్లు ప‌క్క‌న పెట్టిన‌ట్లు తెలుస్తోంది. ఇక‌పై ఈ ముగ్గురు సీనియ‌ర్ ప్లేయ‌ర్లు టెస్టులు, వ‌న్డేల్లో మాత్ర‌మే భాగ‌మ‌య్యే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి.

ఇక ఈ సిరీస్‌కు ఆల్‌రౌండ‌ర్ షాదాబ్ ఖాన్‌, స్పీడ్ స్టార్ హ్యారిస్ ర‌వూఫ్ గాయం కార‌ణంగా దూర‌మ‌య్యాడు. అయితే వెట‌ర‌న్ ఆట‌గాడు మొహమ్మద్ నవాజ్ మాత్రం సెల‌క్ట‌ర్లు తిరిగి పిలుపునిచ్చారు. అదేవిధంగా యువ పేస్ సంచలనం సల్మాన్ మీర్జాకు సైతం ఈ జ‌ట్టులో చోటు ద‌క్కింది. ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్ జూలై 20 నుంచి 24 మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. మొత్తం మూడు మ్యాచ్‌లు కూడా ఢాకా వేదిక‌గా జ‌ర‌గ‌నున్నాయి.

బంగ్లాతో టీ20 సిరీస్‌కు పాక్ జ‌ట్టు
సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, అహ్మద్ డానియాల్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ హారీస్ (వికెట్ కీప‌ర్‌), మహ్మద్ నవాజ్, సాహిబ్జాదా సల్మాన్ , మొహమ్మద్ నవాజ్, సైమ్ అయూబ్, సల్మాన్ మీర్జా ,సుఫ్యాన్ మోకిమ్.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)