Breaking News

విధ్వంసం సృష్టించిన నితీశ్‌ రాణా.. బ్యాటింగ్‌లో ఉగ్రరూపం, బౌలింగ్‌లో అద్భుతం

Published on Mon, 09/01/2025 - 08:10

ఢిల్లీ ప్రీమియర్‌ లీగ్‌ రెండో ఎడిషన్‌ (2025) విజేతగా వెస్ట్‌ ఢిల్లీ లయన్స్‌ అవతరించింది. నిన్న (ఆగస్ట్‌ 31) జరిగిన ఫైనల్లో ఆ జట్టు సెంట్రల్‌ ఢిల్లీ కింగ్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. వెస్ట్‌ ఢిల్లీ లయన్స్‌ను ఆ జట్టు కెప్టెన్‌ నితీశ్‌ రాణా ఒంటిచేత్తో గెలిపించాడు. తొలుత బౌలింగ్‌లో అదరగొట్టి (4-0-16-1), ఆతర్వాత బ్యాటింగ్‌లో (49 బంతుల్లో 79 నాటౌట్‌; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) బెదరగొట్టాడు.  

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన సెంట్రల్‌ ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. యుగల్‌ సైనీ (48 బంతుల్లో 65; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ప్రన్షు విజయ్రాన్‌ (24 బంతుల్లో 50 నాటౌట్‌; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ద సెంచరీలతో మెరిశారు. 

ఆఖర్లో ప్రన్షు విరుచుకుపడకపోయుంటే సెంట్రల్‌ ఢిల్లీ ఈ స్కోర్‌ చేయలేకపోయేది. ప్రన్షు, సైనీ మినహా సెంట్రల్‌ ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. వెస్ట్‌ ఢిల్లీ బౌలర్లలో నితీశ్‌ రాణా, మనన్‌ భరద్వాజ్‌ (3-0-11-2), శివాంక్‌ వశిష్ట్‌ (2-0-12-2) సెంట్రల్‌ ఢిల్లీ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. శుభమ్‌ దూబే, మయాంక్‌ గుసేన్‌ తలో వికెట్‌ తీసినా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.

అనంతరం ఓ మోస్తరుకు మించిన లక్ష్య ఛేదనకు దిగిన వెస్ట్‌ ఢిల్లీ.. నితీశ్‌ రాణా విధ్వంసం సృష్టించడంతో మరో 2 ఓవర్లు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. రాణాకు జతగా హృతిక్‌ షోకీన్‌ (27 బంతుల్లో 42 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా బ్యాట్‌ ఝులిపించి వెస్ట్‌ ఢిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. సెంట్రల్‌ ఢిల్లీ బౌలర్లలో ఒక్కరు కూడా రాణా, షోకీన్‌ జోరుకు అడ్డుకట్ట వేయలేకపోయారు.

ఈ సీజన్‌ ఆధ్యాంతం నితీశ్‌ రాణా అద్భుత ప్రదర్శనలు చేశాడు. కీలక మ్యాచ్‌ల్లో మరింత చెలరేగి ఆడాడు. ఎలినేటర్‌ మ్యాచ్‌లో విధ్వంసకర శతకం (55 బంతుల్లో 134 నాటౌట్‌), క్వాలిఫయర్‌-2లో మెరుపు ఇన్నింగ్స్‌ (26 బంతుల్లో 45 నాటౌట్‌) ఆడి తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఫైనల్లో బ్యాట్‌తో పాటు బంతితోనూ సత్తా చాటి ఒంటిచేత్తో తన జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టాడు.

ఈ టోర్నీ గత సీజన్‌లో ఐపీఎల్‌ సంచలనం ప్రియాన్ష్‌ ఆర్య (పంజాబ్‌ కింగ్స్‌) నితీశ్‌ తరహాలోనే రెచ్చిపోయి వెలుగులోకి వచ్చాడు. ఆతర్వాత ప్రియాంశ్‌ ఆర్య ఐపీఎల్‌లో ఏం చేశాడో అంతా చూశాం. ఈ సీజన్‌ మెరుపు ప్రదర్శనలతో నితీశ్‌ కూడా భారత పరిమిత ఓవర్ల జట్లలోకి వచ్చి అద్భుతాలు చేస్తాడేమో చూడాలి. నితీశ్‌ ఐపీఎల్‌లో గత సీజన్‌కు ముందే కేకేఆర్‌ నుంచి రాజస్థాన్‌ రాయల్స్‌కు మారాడు. గత సీజన్‌లో అతను చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ చేయలేదు.  

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)