Breaking News

అత‌డు మా జ‌ట్టుకు ఫినిష‌ర్‌.. అందుకే నేను బ్యాటింగ్‌కు రాలేదు

Published on Thu, 04/17/2025 - 12:43

ఐపీఎల్‌-2025లో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ అనుహ్య ఓటమి చ‌విచూసింది. సూప‌ర్ ఓవ‌ర్ థ్రిల్ల‌ర్‌లో ఢిల్లీపై రాజ‌స్తాన్ పై చేయి సాధించ‌లేక‌పోయింది.  ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 188 ప‌రుగులు చేసింది. అనంత‌రం రాజ‌స్తాన్ కూడా స‌రిగ్గా 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 188 ప‌రుగులు చేసింది.

దీంతో మ్యాచ్ ఫ‌లితాన్ని తేల్చడానికి సూప‌ర్ ఓవ‌ర్‌ను నిర్వ‌హించారు. సూప‌ర్ ఓవ‌ర్‌లో రాజ‌స్తాన్ రాయ‌ల్స్ తొలుత రియాన్ ప‌రాగ్‌, షిమ్రాన్ హెట్‌మైర్‌ల‌ను బ్యాటింగ్ పంపింది. ప‌రాగ్ ఔటైన త‌ర్వాత జైశ్వాల్ బ్యాటింగ్‌కు వ‌చ్చాడు. రాజ‌స్తాన్ సూప‌ర్ ఓవ‌ర్‌లో రెండు వికెట్లు కోల్పోయి 11 పరుగులు మాత్ర‌మే చేసింది. ఆ రెండు వికెట్లు కూడా ర‌నౌట్ల రూపంలో వ‌చ్చినివే కావ‌డం గ‌మానార్హం. 

అయితే 51 ప‌రుగులతో క్విక్ ఇన్నింగ్స్ ఆడిన నితీష్ రాణాను సూప‌ర్ ఓవ‌ర్‌లో రాజ‌స్తాన్ మెనెజ్‌మెట్ బ్యాటింగ్‌కు  పంపించ‌కపోవ‌డం అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. హెట్‌మైర్ స్టార్క్ బౌలింగ్‌ను ఎదుర్కొవ‌డానికి ఇబ్బంది ప‌డుతున్న‌ప్పుడు మ‌ళ్లీ అత‌డినే ఎందుకు బ్యాటింగ్‌కు పంపించారని రాజ‌స్తాన్ మెనెజ్‌మెంట్‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురుస్తోంది. తాజాగా సూప‌ర్ ఓవ‌ర్‌లో త‌ను బ్యాటింగ్‌కు రాక‌పోవ‌డంపై నితీష్ స్పందించాడు.

"హెట్‌మైర్‌, ప‌రాగ్‌ల‌ను బ్యాటింగ్ పంపించాల‌న్న‌ది ఎవ‌రో ఒక్క‌రు తీసుకున్న నిర్ణ‌యం కాదు.  జ‌ట్టు మెనెజ్‌మెంట్ తీసుకున్న నిర్ణ‌యం అది.  కోచ్‌ల‌తో పాటు కెప్టెన్‌, ఇద్ద‌రు సీనియ‌ర్ ఆట‌గాళ్లు అంద‌రూ ఆలోచించే వారిని బ్యాటింగ్‌కు పంపించారు. అదే షిమ్రాన్ హెట్మైర్ రెండు సిక్సర్లు కొట్టి ఉంటే, మీరు ఈ ప్రశ్న నాకు అడిగి ఉండ‌రు. నా దగ్గర వేరే సమాధానం లేదు కూడా. 

మేము తీసుకున్న నిర్ణ‌యం ఖచ్చితంగా సరైనదే. హెట్‌మైర్‌ మా ఫినిషర్. గ‌తంలో అత‌డు ఎన్నో మ్యాచ్‌ల‌ను గెలిపించాడు. మేము సూపర్ ఓవ‌ర్‌లో గెలిచి ఉంటే మీ ప్రశ్న కాస్త భిన్నంగా ఉండేది. క్రికెట్‌లో ఎప్పుడు ఏమి జ‌రుగుతుందో ఎవ‌రూ ఊహించ‌లేరు. 

సందీప్ శర్మ గతంలో సూపర్ ఓవర్‌లో బాగా బౌలింగ్ చేశాడు. ఈ సారి కూడా అందుకే అత‌డికి బంతిని ఇచ్చాము. ఏదేమైన‌ప్ప‌టికి సూప‌ర్ ఓవ‌ర్‌లో నాలుగు నుంచి ఆరు ప‌రుగులు అద‌నంగా సాధించి ఉంటే ప‌రిస్థితి వేరే విధంగా ఉండేది" అని పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో రాణా పేర్కొన్నాడు.
చ‌ద‌వండి: 'మ‌రీ అంత స్వార్ధం ప‌నికిరాదు బ్రో.. నీ వ‌ల్లే రాజ‌స్తాన్ ఓడిపోయింది'
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)